నమాజుకు పదండి!
హజ్రత్ హాతిమ్ (రహ్మాలై) తన నమాజు విధానాన్ని ఇలా వివరించారు. ‘‘నమాజు కోసం అజాన్ పిలుపు ...
ఇస్లాం సందేశం
హజ్రత్ హాతిమ్ (రహ్మాలై) తన నమాజు విధానాన్ని ఇలా వివరించారు. ‘‘నమాజు కోసం అజాన్ పిలుపు వినగానే వుజూ చేసుకుంటాను. అనంతరం ప్రాపంచిక విషయాలన్నింటినీ త్యజించి నమాజు చేసే స్థలానికి చేరకుంటాను. అక్కడ కాసేపు మౌనంగా కూర్చుండిపోతాను. మానసిక ప్రశాంతత కుదిరాక నమాజుకోసం లేచి నిలబడతాను. నా ఎదురుగా దైవ గృహం కాబా ఉంది. నా కాళ్లకింద నరకాన్ని దాటిపోయే వంతెన పుల్సిరాత్ ఉంది. నా కుడివైపున స్వర్గముంది. నా ఎడమ పక్కన నరకాగ్ని ఉంది. మృత్యుదూత నా వెనుకాలే కాపుగాసి నిల్చున్నాడు. ఇదే నా చివరి నమాజు అనే స్పృహతో నమాజు ఆచరిస్తాను. మరో నమాజు చదివే సౌభాగ్యానికి నేను నోచుకుంటానో లేదోననే భావనతో నమాజులో లీనమై పోతాను.’’
‘ఇస్లాం మూల స్తంభాల్లో నమాజు కీలకమైంది. ఎవరైతే నమాజును చేస్తారో అతను ధర్మాన్ని కాపాడినట్లే. ఎవరు త్యజించారో వారు ధర్మాన్ని కూల్చినట్లే’ అని ప్రవక్త (స) చెప్పారు. రోజులో వీలైనంత సమయం మసీదులోనే గడపాలని మహనీయులు చెప్పేవారు. నమాజు ద్వారా ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. బద్దకం దూరమవుతుంది. భౌతిక ప్రపంచంలోనూ, పరలోక రాజ్యంలోనూ ఎనలేని ప్రయోజనాలున్నాయని జాదుల్ మాద్ గ్రంథంలో ఉంది.
- ఖైరున్నీసాబేగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం
-
Flipkart: ‘బిగ్ బిలియన్ డేస్’ యాడ్.. ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌పై కాయిట్ ఫిర్యాదు