ఆదిశక్తినే కూతురిగా కోరుకున్నాడు...
మతంగ మహర్షి పుత్రుడు మాతంగముని. అతడు హిమవంతుడితో స్నేహం చేశాడు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకునేవారు. ఒకసారి మాటల్లో హిమవంతుడు తన పుత్రిక పార్వతీదేవి గురించి గొప్పగా చెప్పాడు.
మతంగ మహర్షి పుత్రుడు మాతంగముని. అతడు హిమవంతుడితో స్నేహం చేశాడు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకునేవారు. ఒకసారి మాటల్లో హిమవంతుడు తన పుత్రిక పార్వతీదేవి గురించి గొప్పగా చెప్పాడు. ఆమె తన కూతురు కావడం తన అదృష్టమన్నాడు. ఆ మాటల్లో తప్పు ఏమీ లేకున్నా మతంగునికి ఎందుకో నచ్చలేదు. బహుశా ఈర్ష్య కలిగింది. దాంతో ఆదిశక్తి స్వరూపమైన శ్యామలాదేవిని ఆరాధించాడు. తపస్సు చేశాడు. ఆయన భక్తికి ముగ్ధురాలైన దేవి ప్రత్యక్షమైంది. ‘ఏమి నీ కోరిక?’ అనడిగింది. ‘అమ్మా! నాకు వేరే ఏ కోరికలూ లేవు. నువ్వు నాకు కుమార్తెగా జన్మించు. నా జన్మ చరితార్థమవుతుంది’ అంటూ వేడుకున్నాడు. దేవి కాదనలేదు. మతంగునికి పుత్రికగా పుట్టింది. అతని ఆనందానికి ఎల్లలు లేకుండా పోయాయి. హిమవంతుని గర్వమణిచాను అనుకున్నాడు. దేవి మతంగునికి పుట్టినందున మాతంగి అయ్యింది. అమ్మవారి ఎనిమిదో అవతారం మాతంగి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ