దృష్టి దోషం తగలకూడదని...

ఆలయాల్లో దేవుడికి జరిగే అన్ని సేవలూ భక్తులు చూస్తుంటారు. అయితే నివేదన సమయంలో పరదా వేస్తుంటారు. నైవేద్య సమర్పణ ఎందుకు చూడకూడదు?

Published : 03 Jan 2019 00:29 IST

ఆలయాల్లో దేవుడికి జరిగే అన్ని సేవలూ భక్తులు చూస్తుంటారు. అయితే నివేదన సమయంలో పరదా వేస్తుంటారు. నైవేద్య సమర్పణ ఎందుకు చూడకూడదు?

సుప్రదీప్త్‌, హైదరాబాద్‌

 

ఆలయాలలో అర్చనలలో జరిగే షోడశ ఉపచారాలలో నివేదన ఒకటి. మిగిలిన అన్ని సేవలూ మనం చూసి తరించటానికి. కానీ, నివేదన చేసే వేళ దృష్టి దోషం రాకుండా ఉండాలని దృష్టి దోషం తగలకూడదని...ఆగమ సంప్రదాయం. పెద్దలు, పసిపిల్లలు భోజనం చేసే సమయాలలో మన ఇళ్లలో కూడా ఇలాంటి విధానం పాటించటం మనం గమనించవచ్చు. దేవునికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది. అందుకు నివేదన సమయంలో దృష్టి దోష పరిహారార్థం తెరకట్టడం ఆగమ సంప్రదాయం.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని