మా వైపు చూడవా?!

మామూలు ప్రార్థన కన్నా, ఉపవాసం ఉండి చేసే ప్రార్థనకు ఫలితం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. బైబిల్‌లోని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడికి ఇష్టమైన ఉపవాసం గురించి ఉంది... కొందరు భక్తులు ‘మేం ఉపవాసం ఉంటే నువ్వు

Updated : 31 Mar 2022 04:50 IST

మామూలు ప్రార్థన కన్నా, ఉపవాసం ఉండి చేసే ప్రార్థనకు ఫలితం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. బైబిల్‌లోని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడికి ఇష్టమైన ఉపవాసం గురించి ఉంది... కొందరు భక్తులు ‘మేం ఉపవాసం ఉంటే నువ్వు మా వైపు ఎందుకు చూడవు? మా ప్రార్థనలకు ఎందుకు ప్రతిస్పందించవు?’ అనడిగారు. అప్పుడు ప్రభువు ‘మీరు మీ వ్యాపకాల్లో ఉండి చేసేది హృదయపూర్వక ఉపవాసం కాదు. ఇతరులతో గొడవ పడతారు. అన్యాయంగా ప్రవర్తిస్తారు. నిజమైన ఉపవాసమంటే ఆకలిగొన్నవారికి ఆహారమివ్వాలి. పేదలు, అనాథలు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఇదే  నిజమైన, నాకు ఇష్టమైన ఉపవాసం. అలా చేస్తే.. స్వస్థత చేకూరుతుంది. నేను మీకు కాపలా కాస్తాను. పిలిచినప్పుడు బదులిస్తాను. ప్రార్థనలకు జవాబిస్తాను. కష్టకాలంలో నడిపిస్తాను. ఎన్నడూ నీళ్లకు లోటులేని ఊటబావిలా ఉంటాను’ అంటూ బదులిచ్చాడు. కనుక ఏదో సంప్రదాయంగా కాకుండా దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసం ఉంటే ఆయన ఆశీర్వాదాలు అందిస్తాడు.   

  - జి.ప్రశాంత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని