మనమొకటి తలిస్తే..

‘మనం చేయాల్సిన పనులు ప్రణాళికల ఆధారంగానే సాగుతాయా లేక దేవుని ఆదేశాల ప్రకారమా?’ అని అడిగాడో శిష్యుడు.

Updated : 27 Oct 2022 01:27 IST

‘మనం చేయాల్సిన పనులు ప్రణాళికల ఆధారంగానే సాగుతాయా లేక దేవుని ఆదేశాల ప్రకారమా?’ అని అడిగాడో శిష్యుడు. దానికి రమణ మహర్షి ‘ఇది తర్కంతో కూడిన ప్రశ్న కనుక నా జవాబులో దాగిన తర్కాన్ని నువ్వు గ్రహించాలి. నీ కర్మల ఖాతాలో లేనివాటిని ఎంతగా ప్రయత్నించినా అవి నెరవేరవు. అంటే ఆ పనిని సంకల్పం, కృషి, దీక్షలతో చేసినప్పటికీ ఫలితం శూన్యమే. కర్మల జాబితాలో జరగాల్సిన నిబంధన ఉంటే అప్పుడా పనే వెదుక్కుంటూ వచ్చి నిన్ను విజయ శిఖరాన నిలుపుతుంది. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనేది గొప్ప సూక్తి. శ్రమించి పని చేయాలి. కానీ కర్మ నిబంధన లేకుంటే అర్హతలూ, సామర్థ్యాలూ, కృషి, పట్టుదల ఎన్ని ఉన్నా గానీ ప్రతిఫలం దక్కకపోవడం చూస్తాం. ‘అంటే వ్యక్తికి స్వీయ నిర్ణయాధికారం లేదా?’ అని అడుగుతావేమో! ఉంది. కానీ అది కొన్ని విషయాల్లో, కొన్ని షరతులతో మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు నీకు స్థల మార్పిడి యోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా వెళ్లలేవు. నువ్వు వెళ్లాల్సి ఉంటే అనుకోకుండా ఏదో మిష మీద వెళ్తావు. అందుకే ‘తానొకటి తలిస్తే దైవ మొకటి తలచింది’ అనే నానుడి లోకంలో స్థిరపడింది. 

 - ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు