భగవంతుడు మనలోనే ఉన్నాడు

మనకు కావలసినవన్నీ అందుబాటులోనే ఉంటాయి. కానీ అది గ్రహించక ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. దీన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక మహర్షి రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పేవారు.

Published : 08 Dec 2022 01:00 IST

మనకు కావలసినవన్నీ అందుబాటులోనే ఉంటాయి. కానీ అది గ్రహించక ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. దీన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక మహర్షి రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పేవారు.
ఓ వ్యక్తి చుట్ట కాల్చుకునేందుకు రాత్రివేళ పొరుగింటికి వెళ్లి నిప్పు కోసం తలుపు తట్టాడు. రాత్రివేళ ఎందుకొచ్చావని ఇంటాయన అడిగితే ధూమపాన ప్రియుడు విషయం చెప్పాడు. అది విని ‘వెలుగుతున్న లాంతరు చేతిలోనే ఉంచుకుని నిప్పు కోసం రావడమేంటి?’ అంటూ నవ్వాడు. నిజమేనంటూ తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. దైవం కోసం ఎక్కడో అన్వేషించడమూ అంతే. దేవుడు మన చెంతే, మనలోనే ఉన్నాడు.
గోవిందం ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని