Published : 09 Mar 2023 00:09 IST

దేవతలకూ దండన తప్పదు

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచుతున్నాడు మోహిని అవతారంలో ఉన్న విష్ణువు. దాంతో రాహుకేతులనే రాక్షసులు అమృతం కోసం దేవతల వరుసలోకి మారారు. అది గమనించిన సూర్యచంద్రులు వాళ్లు దేవతలు కాదు, రాక్షసులంటూ మోహినికి సైగ చేసి చెప్పారు. కానీ వాళ్లు అప్పటికే అమృతం తాగేశారు. గొంతు వరకు దిగిన అమృతం వల్ల విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రాయుధం రాహువును అమరుణ్ణి చేసింది. తోక భాగానికి అమృతం అందనందున అది అదృశ్య రూపం కలిగిన కేతువయ్యింది. అయితే సూర్యచంద్రులు చేసింది పర పీడనం. అందువల్ల ఆ తప్పుకు దండన తప్పలేదు. అందుకే గ్రహణ రూపంలో వాళ్లని మింగి విడవడం జరుగుతోంది. ‘తప్పు చేస్తే దేవతలు సైతం దండనార్హులే’ అని తెలియజేసే కథనమిది.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు