విశ్వప్రేమే ధ్యేయం
చైతన్య స్వరూపాన్ని ఎలా చేరాలి? అదసలు సాధ్యమేనా? అనిపిస్తుంటుంది కదూ! నిజానికి శరీరాన్ని ఆధారం చేసుకుని మనలో ఉన్న ఆత్మ కూడా చైతన్య స్వరూపమే.
చైతన్య స్వరూపాన్ని ఎలా చేరాలి? అదసలు సాధ్యమేనా? అనిపిస్తుంటుంది కదూ! నిజానికి శరీరాన్ని ఆధారం చేసుకుని మనలో ఉన్న ఆత్మ కూడా చైతన్య స్వరూపమే. ముందుగా అది అర్థం చేసుకోవాలి. అసలు చైతన్యమంటే ఏమిటి, దాని రూపమేమిటనే చింతన కలగాలి. తెలివిడిగా అస్తిత్వంలో ఉండటం, ఒకింత స్పృహ కలిగి చక్కటి అవగాహనతో వ్యవహరించటమే చైతన్యం. దీనికి తొలి ఆలంబన ప్రకృతి. అందులోని సౌందర్యం, బీభత్సం, విలక్షణత, వైరుధ్యం వంటివి ఆకళింపు చేసుకోగలగాలి. సృష్టి గమనానికి ఇవి చాలా అవసరమని గ్రహిస్తేనే జనన, మరణాల వెనుక దాగిన రహస్యం తెలుస్తుంది. అది బోధించేందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ప్రవచించాడు.
లోకంలోని అనేక విషయాలు చక్షువుల ద్వారా గోచరమై, బుద్ధిబలంతో స్థిర పడతాయి. కొన్నిటికి శ్రవణాలు వాహికలవుతాయి. ఈ సకలచరాచర జగత్తులోని సకల జీవరాశీ ఆ భగవంతుడి సృజనే. ఆయన చైతన్య స్వరూపమే. ఈ భావనను మనసా వాచా కర్మణా అనుభవంలోకి తెచ్చుకునే సాధన చెయ్యాలి. అపుడే ప్రతిదానిలో, ప్రతి ఒక్కరిలో ఆయనే మనకు సాక్షాత్కరిస్తాడు. ఇది మనసులో స్థిరపడిన క్షణం భగవంతుడి విశ్వరూప భావనను సరిగానూ, పరిపూర్ణంగానూ అర్థం చేసుకోగలం. కానీ ఇదంత సులభం కాదు. మనలో ఉండే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఆత్మను ఆవరించి, పెనవేసుకుని ఉంటాయి. దుర్బేధ్యమైన కోటను కట్టి పహరా కాస్తుంటాయి. వ్యక్తిగత, స్వార్థపూరిత ప్రేమను విశ్వప్రేమగా మార్చుకోవాలి. ఈ ఆలోచనా చైతన్యం మనకు, మనలోని ఆత్మకు మధ్యనున్న అవరోధాలన్నిటినీ తొలగించి దానికి చేరువ చేస్తుంది. ఈ స్థితిలో సృష్టి అంతటా ఆనందమే. అదే ఆత్మకు మేలుకొలుపు. అలా ఉత్తేజితమైన ఆత్మ ఆనందసీమల్లో విహరిస్తుంది. ఆ ఆనందయోగస్థితే చైతన్య స్వరూపం. అదే భగవంతుడి రూపం. కేవలం మనిషి మాత్రమే సమకూర్చుకోగల మహోన్నత గుణం చైతన్యం.
బొడ్డపాటి చంద్రశేఖర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Sharma: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!