కల వస్తే చెప్పకూడదు

అబూ సల్మా అనే ప్రవక్త (స) శిష్యురాలికి రోజూ పీడకలలు వస్తుండేవి. ఆ కలలు ఆమెని వెంటాడి వేధిస్తూ అనారోగ్యానికి దారి తీసేవి. ఈ సమస్యకు పరిష్కారం కోసం అబూ ఖతాదా (రజి) అనే పండితుడికి తన పీడ కలల గురించి చెప్పి బాధపడింది.

Updated : 25 May 2023 00:41 IST

అబూ సల్మా అనే ప్రవక్త (స) శిష్యురాలికి రోజూ పీడకలలు వస్తుండేవి. ఆ కలలు ఆమెని వెంటాడి వేధిస్తూ అనారోగ్యానికి దారి తీసేవి. ఈ సమస్యకు పరిష్కారం కోసం అబూ ఖతాదా (రజి) అనే పండితుడికి తన పీడ కలల గురించి చెప్పి బాధపడింది. దానికాయన ‘దైవం వల్ల మంచి కలలు వస్తాయి. మీలో ఎవరైనా మంచి కలలు వస్తే ఆత్మీయ మిత్రుడికి తప్ప మరెవ్వరికీ చెప్పకూడదు. ఒకవేళ పీడ కలలు వస్తే ఆ స్నేహితుడికి కూడా చెప్పకూడదు. మెలకువ వచ్చిన వెంటనే ‘అవుజుబిల్లాహి మినష్షైతానిర్రజీమ్‌’ అంటూ మూడుసార్లు పఠించి ఎడమవైపు తిరిగి పడుకోవాలి. మంచి స్వప్నాన్ని చూసినప్పుడు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపు కోవాలి. దాన్ని శుభసూచకంగా భావించాలి’ అంటూ వివరించారు ఉలమాలు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని