పరమాత్మ జాడ..

ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ‘నేను’ గురించి ఎన్నెన్నో భాష్యాలు చెప్పారు. పాంచభౌతికమై, త్రిగుణాలతో విలసిల్లే దేహం మన కళ్ల ముందు కదలాడు తున్నప్పుడు మోక్ష సాధనకు ఈ దేహమే సాధనమని గ్రహిస్తాడు.

Published : 20 Jul 2023 01:11 IST

ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ‘నేను’ గురించి ఎన్నెన్నో భాష్యాలు చెప్పారు. పాంచభౌతికమై, త్రిగుణాలతో విలసిల్లే దేహం మన కళ్ల ముందు కదలాడు తున్నప్పుడు మోక్ష సాధనకు ఈ దేహమే సాధనమని గ్రహిస్తాడు. ‘నేను’ అంటే శూన్యమైనా, ఆ శూన్యం లేదా సున్నాకి ఉన్న విలువకు మల్లేనే ఈ ‘నేను’కూ ఓ పరమార్థం ఉంటుంది. ఆలోచించి, అర్థం చేసుకుంటే.. ఆత్మ పరమాత్మలో లీనమవటమే కదా, పయనం లేదా యానం అంటే! పరమాత్మను ఎక్కడని వెతకగలం? నిజానికి పరమాత్మ మన ఎదుటే సంచరిస్తున్నా గుర్తించలేం. లయమవడం లేదా లీనమవటం అనేది మనకు తెలియకపోయినంతలో పరమాత్మ అనేది లేదని అనలేం. ఒకవేళ అన్నా అది ఈ సృష్టిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. మమేకమైనప్పుడు యథార్థంగా దాన్ని మనం గుర్తించలేక- అదే యమలోక పయనం అనుకుంటున్నాం. సర్వం పరమాత్మే అయినప్పుడు ఆ యమ సదనం మాత్రం పరమాత్మ వశం కాదా? పేరు ఏదైతేనేం.. తీరూ, తీరమూ ఒకటే కదా!

నాగిని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని