రాముడికి 63లా ఉండాలి
తులసీ దాసు గొప్ప రామ భక్తుడు. తాను రచించిన ‘రామచరిత మానస్’లోరామ్ నామ్ మనిదీప్ ధరు జీహ దేహరి ద్వార్‌తులసి భితర్ బాహేరహున్ జ్యో చాహసి ఉజియార్
తులసీ దాసు గొప్ప రామ భక్తుడు. తాను రచించిన ‘రామచరిత మానస్’లో
రామ్ నామ్ మనిదీప్ ధరు జీహ దేహరి ద్వార్
తులసి భితర్ బాహేరహున్ జ్యో చాహసి ఉజియార్
అంటూ రాశాడు. దీపాన్ని గుమ్మంలో గనుక అమర్చినట్లయితే ఇంటి లోపల, బయట కూడా చీకటిని పారదోలి వెలుగును ప్రసరించినట్లు.. రామ నామాన్ని ఉచ్చరిస్తుంటే సర్వ పాపాలూ పోయి పుణ్యం లభిస్తుందన్నమాట. తులసీ దాసు ఇంకో చోట.. రెండక్షరాల రామ శబ్ద మహిమను వివరిస్తూ
తులసి రా కె కహత్ హి, నికసత్ పాప్ పహార్
పున్ ఆవన్ పావత్ నహిన్, దేత్ మకార్ కివార్
అంటాడు తులసీ దాసు. మొదటి అక్షరం ‘రా’ అని ఉచ్చరించగానే నోరు తెరుచుకుని, లోపలి పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. రెండో అక్షరం ‘మ’ పలకగానే పెదాలు కలిసిపోతాయి. అంటే బయట నుంచి తిరిగి పాపాలు లోపలికి వెళ్లే అవకాశంలేదు. అలా కేవలం ‘రామ’ శబ్దాన్ని పలికినంతలో ఎంత మహిమ ఉంటుందో చెప్పాడు. మరో దోహాలో తులసీ దాసు రాముడితో ఎలాంటి సంబంధం ఉండాలో వివరించాడు. అందుకాయన దేవనాగరి లిపి అంకెలతో పోల్చి ఉదహరించాడు.
జగ తే రహు ఛత్తీస్ వ్హై రామ్ చరన్ చఃతీన్
తులసి దేఖు విచారి హియ, హై యహ మతౌ ప్రవీన్
జగతి పట్ల 36 సంఖ్యలా విముఖంగా ఉండాలి. అదే శ్రీరాముడి విషయంలో 63లా అభిముఖంగా అంటే.. భగవంతుడి పట్ల ఆసక్తీ, అనురాగం కలిగుండాలన్నది తులసీ దాసు భావం.
డా. నరసింహరావు కల్యాణి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న