సుఖ దుఃఖాలు

భారతంలోని ఈ శ్లోకానికి- సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తాయి. దుఃఖమూ సుఖమూ ఎవరికీ, ఎప్పుడూ నిత్యం కాదని అర్థం. సుఖమంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం.

Published : 07 Sep 2023 02:10 IST

సుఖస్యానంతరం దుఃఖం
దుఃఖస్యానంతరం సుఖం
న నిత్యం లభతే దుఃఖం
న నిత్యం లభతే సుఖం

భారతంలోని ఈ శ్లోకానికి- సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తాయి. దుఃఖమూ సుఖమూ ఎవరికీ, ఎప్పుడూ నిత్యం కాదని అర్థం. సుఖమంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం.‘సుఖ దుఃఖంబులు రెండును నీ మిత్రులేను ఒకటి నీ సహ పంక్తిని చేరి భుజించుచుండ
వేరొకటి వాకిలి చెంతన వేచి యుండు’ అన్నది ఖలీల్‌ జిబ్రాన్‌ సూక్తి. నిత్య జీవితంలో సుఖదుఃఖాలు రెండూ ఎదురవుతాయి. సుఖానికి పొంగిపోవడం, బాధకు కుంగిపోవడం రెండూ తగదు. దేన్నయినా యథాతథంగా స్వీకరించి అనుభవించాలే తప్ప వాటికి లొంగిపోకూడదు. అయితే సుఖాన్ని కోరినట్లు దుఃఖాన్ని ఎవరూ ఆశించరు. కానీ సంభవించిన సమస్యల దుఃఖాగ్నిని తట్టుకున్న వారు, ఆ వేదనలో దహించినవారు.. అగ్నిలో కాలిన మేలిమి బంగారమై నిలుస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని