నేను ముహమ్మద్‌ని!

అరాషీ తెగకు చెందిన ఓ వ్యక్తి కొన్ని ఒంటెలతో మక్కా నగరానికి వచ్చాడు. అబూజహల్‌ అనే పేరుమోసిన ఖురైష్‌ నాయకుడు ఆ ఒంటెల్ని కొన్నాడు. కానీ వాటి ఖరీదు ధనాన్ని ఇవ్వమని అడిగితే దాటేశాడు.

Published : 12 Oct 2023 00:06 IST

రాషీ తెగకు చెందిన ఓ వ్యక్తి కొన్ని ఒంటెలతో మక్కా నగరానికి వచ్చాడు. అబూజహల్‌ అనే పేరుమోసిన ఖురైష్‌ నాయకుడు ఆ ఒంటెల్ని కొన్నాడు. కానీ వాటి ఖరీదు ధనాన్ని ఇవ్వమని అడిగితే దాటేశాడు. నిస్సహాయుడైన అరాషీ కాబా గృహంలో కూర్చున్న ఖురైష్‌ నాయకులకు అబూజహల్‌ దౌర్జన్యాన్ని వినిపించాడు. అబూజహల్‌కు ఎదురెళ్లేంత సాహసం ఎవరూ చేసేవారు కాదు. దాంతో వాళ్లు.. ‘అదిగో ఆ మూలన కూర్చున్న పెద్దమనిషికెళ్లి చెప్పు! అతను నీ డబ్బు తిరిగి ఇప్పిస్తాడు’ అన్నారు. దాంతో అతడు ఆ పెద్దాయన దగ్గరికెళ్లి, తన బాధ పంచుకున్నాడు. ఆయన అరాషీని వెంటబెట్టుకుని అబూజహల్‌ తలుపు తట్టారు. ‘ఎవరూ?’ అని లోపలి నుంచే అడిగాడతను. ‘నేను ముహమ్మద్‌ని’ అని బదులివ్వగా.. అతడు ఆశ్చర్యంతో గబుక్కున బయటికొచ్చాడు. ‘ఇతడికి ఇవ్వాల్సింది ఇచ్చెయ్యి!’ అన్నారాయన. అబూజహల్‌ మారుమాట్లాడలేదు. లోనికెళ్లి డబ్బు తెచ్చి ఒంటెల ఖరీదు లెక్కకట్టి ఇచ్చాడు. కాబాలోని ఖురైష్‌ నాయకులు ఈ వ్యవహారం జీర్ణించుకోలేకపోయారు. ముహమ్మద్‌ను ఆటపట్టించడానికి అరాషీని పంపారే గానీ ఆయనంత మహనీయుడని వారికి తెలీదు.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని