నిమిత్తమాత్రులం!

అశ్ముడు అనే తపోదీక్షాపరుడు జనక మహారాజును దర్శించుకునేందుకు వచ్చాడు. మాటల సందర్భంలో ‘విప్రోత్తమా! మనమంతా శ్రేయస్సునే కోరుకుంటాం కదా!

Published : 02 Nov 2023 00:42 IST

శ్ముడు అనే తపోదీక్షాపరుడు జనక మహారాజును దర్శించుకునేందుకు వచ్చాడు. మాటల సందర్భంలో ‘విప్రోత్తమా! మనమంతా శ్రేయస్సునే కోరుకుంటాం కదా! ఇంతకీ.. బంధువులు, సంపదలు లభించినప్పుడు ఎలా ఉండాలి? కోల్పోయినప్పుడు ఎలా ప్రవర్తించాలి?’ అంటూ సందేహం వెలిబుచ్చాడు జనకుడు.

దానికి అశ్ముడు ‘రాజా! జీవులకు సుఖం, దుఃఖం.. ఏది కలిగినా అనుభవించాల్సిందే! మరో మార్గం లేదు. బంధుమిత్ర గణం, ఆసనం, శయనం, వాహనం, ధనం, కాలానుసారం లభించడం, దూరమవడం.. సహజం. వాటి విషయంలో స్వాతంత్య్రం లేదు. స్వతంత్రులమని భ్రమపడతాం. మనం కేవలం నిమిత్తమాత్రులం.

కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజా
కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతి క్రమః

కాలం సర్వప్రాణులకూ పక్వత కలిగిస్తుంది. ప్రజలను నాశనం చేస్తుంది. అందరూ నిద్రపోతుంటే కాలం మెలకువతో ఉంటుంది. కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు’ అంటూ బదులిచ్చాడు.

ప్రాప్తించినది ఏదైనా స్వీకరించి.. ‘మనం నిమిత్తమాత్రులం’ అనుకుని ముందుకు సాగితే జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నది పండిత వాక్య సారాంశం.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని