లక్ష్మీదేవి అలిగిన వేళ
మన సనాతన సంప్రదాయంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. ఆషాఢమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఆషాఢ శుక్ల విదియ నాడు ప్రారంభమై ద్వాదశినాడు ముగుస్తుంది. జగన్నాథడి అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి ఆలయానికి కొంత దూరంలో ఉన్న ‘గుండిచా మాత’ అనే తమ పిన్ని గారింటికి కొత్తరథంలో వెళ్లిరావడమే ఈ రథయాత్ర. ఎక్కడైనా ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలుంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం మూల విరాట్టునే ఊరేగిస్తారు.
ఆషాఢ శుక్ల విదియనాటి ఉదయం అత్యంత కోలాహలంగా విగ్రహాల్ని ఆలయం వెనుకవైపు నుంచి రథంలోకి ఎక్కిస్తారు. ఈ ఉత్సవాన్ని స్థానికంగా ‘పహండీ బిజె’ అంటారు. దీనికి ముందు గజపతి రాజవంశీకులు బంగారు చీపురుతో ఆ రథాన్ని, రథమున్న చోటును శుభ్రంచేస్తారు దీన్ని ‘చెరా పహారా’ అంటారు. అనంతరం ‘గరుడధ్వజం’ రథంమీద జగన్నాథుడు, ‘తాళధ్వజం’ రథంమీద బలభద్రుడు, ‘దేవతళన్’ రథంమీద సుభద్ర అధిరోహించి 12గంటల ఉరేగింపు తర్వాత సాయంత్రానికి ఆలయానికి చేరుతుంది. ఏడు రోజులపాటు అక్కడే ఉంటారు. చెల్లి, అన్నలతో పాటు తనను ఆలయం లోపలికి తీసుకువెళ్లలేదని స్వామిపై అలుగుతుంది లక్ష్మీదేవి. ఆమె పట్టరాని కోపంతో పంచమినాడు రథాన్ని కొంత విరగ్గొట్టి వెళ్లిపోతుంది. దీన్ని ‘హీరా పంచమి’ ఉత్సవం అంటారు. గుండిచామాత ఆతిథ్యం తర్వాత ఆషాఢ శుక్ల దశమి నాడు సోదరీ సోదర సమేతంగా జగన్నాథస్వామి పూరి ఆలయానికి బయల్దేరి మార్గమధ్యంలో ‘అర్థాసనీ’ ఆలయం దగ్గర మధురప్రసాదాన్ని స్వీకరించి పూరి చేరుకుంటారు. దీన్ని ‘బహూడా యాత్ర’ అంటారు. మర్నాడు స్వామివారిని 208 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఈ అలంకరణను ‘సోనా బేషా’ (స్వర్ణవేషం) అంటారు. ఆషాఢ శుద్ధద్వాదశినాడు మళ్లీ స్వామివారిని సోదరసోదరీ సమేతంగా అలంకరించి రత్నపీఠంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర ముగుస్తుంది. ఈ రథయాత్రకు సంబంధించిన ప్రస్తావన మనకు బ్రహ్మాండ, స్కాంద, పద్మ పురాణాల్లో కనిపిస్తుంది.
- డా.ఎస్.ఎల్.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్
-
Sports News
Virat Kohli : విరాట్‌లా సుదీర్ఘ ఫామ్‌లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
-
General News
Telangana News: మహబూబ్‌నగర్‌లో ఫ్రీడం ఫర్ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!