సోలమన్‌ సందేశం

సోలమన్‌ మహారాజు తన ‘సామెతలు’ గ్రంథంలో అనేక విషయాలు చెప్పారు. సోమరులను ఉద్దేశించి ‘సోమరీ.. ఎంతసేపని నిద్రిస్తావు? మెలకువ వచ్చిన తర్వాత కూడా ‘ఇంకొంచెం సేపు పడుకుంటాను, మరికాసేపు కునుకు తీస్తాను...’ అనుకుంటూ

Published : 28 Jul 2022 01:11 IST

సోలమన్‌ మహారాజు తన ‘సామెతలు’ గ్రంథంలో అనేక విషయాలు చెప్పారు. సోమరులను ఉద్దేశించి ‘సోమరీ.. ఎంతసేపని నిద్రిస్తావు? మెలకువ వచ్చిన తర్వాత కూడా ‘ఇంకొంచెం సేపు పడుకుంటాను, మరికాసేపు కునుకు తీస్తాను...’ అనుకుంటూ కాళ్లూచేతులూ ముడుచుకుని పడుకుంటావు. నువ్వలా నిద్రించడం వల్ల దోపిడీ దారులా దౌర్జన్యంగా ప్రవేశిస్తుంది దారిద్య్రం. ఆయుధాలు చేపట్టి వచ్చినట్టు నీ మీదికి లంఘిస్తుంది. చీమలను గమనించు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం పెంచుకో. తమపైన ఏ అధికారులూ, న్యాయాధిపతులూ లేకున్నా, ఎవరూ ఎలాంటి విచారణలూ చేయకున్నా.. అవి సమయం అనువుగా ఉన్నప్పుడు ఆహారం సమకూర్చుకుంటాయి. మనం చీమల కంటే మంచి స్థితిలో ఉన్నాం. ఎన్నో సామర్థ్యాలున్నాయి. బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేస్తే దేనికీ కొదవ లేకుండా అన్ని వేళల్లో హాయిగా బతకొచ్చు’ అంటూ రాశారు.

- జి.ప్రశాంత్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని