రాముణ్ణి మంధర ఎందుకు ద్వేషించింది?

అయోధ్యకి శ్రీరాముడు రాజవ్వాలని ప్రజలంతా ముక్కోటి దేవతలను ప్రార్థించారు. అందరితోపాటు కైకేయి కూడా రామచంద్రుడే రాజవ్వాలని కోరుకుంది. కానీ ఆమెకి మంధర ఎందుకు దుర్బోధ చేసింది? ఆమెకి రాముడిపై కోపమెందుకు?

Updated : 11 Aug 2022 01:14 IST

యోధ్యకి శ్రీరాముడు రాజవ్వాలని ప్రజలంతా ముక్కోటి దేవతలను ప్రార్థించారు. అందరితోపాటు కైకేయి కూడా రామచంద్రుడే రాజవ్వాలని కోరుకుంది. కానీ ఆమెకి మంధర ఎందుకు దుర్బోధ చేసింది? ఆమెకి రాముడిపై కోపమెందుకు? ఎక్కడో పుట్టి పెరిగిన మంధర కైకేయివెంట దాసిగా వచ్చి శ్రీరాముడు వనవాసానికి వెళ్లడానికి కారకురాలైంది. ఈమె పుట్టు పూర్వోత్తరాల గురించి వాల్మీకి చెప్పలేదు గానీ, పురాణాల్లో లిఖితమైంది.

మంధర పూర్వజన్మలో విరోచనుడనే రాక్షసరాజు కుమార్తె. జాతివైరం వలన దేవతలూ, రాక్షసుల మధ్య ఒకసారి యుద్ధం రాజుకుంది. ఆ సమరంలో రాకుమారి మంధర కూడా పాల్గొని దేవతలను అమాంతంగా మింగేయ సాగింది. అప్పుడు ఇంద్రుడు స్త్రీమూర్తి అయిన మంధరపై వజ్రాయుధాన్ని ప్రయోగించాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో విష్ణువు సంశయించకుండా ఆయుధం ప్రయోగించమన్నాడు. అది కాస్తా మంధర వీపును తాకడంతో ఆమెకి గూని వచ్చింది. వజ్రాయుధాన్ని ప్రయోగించిన ఇంద్రుడిపై కాకుండా, ప్రేరేపించిన శ్రీమహా విష్ణువుపై కోపం పెంచుకుంది మంధర. బ్రహ్మదేవునికై తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరమిచ్చాడు. అలా మంధర త్రేతాయుగంలో మళ్లీ పుట్టి, శ్రీరాముడిపై కక్ష తీర్చుకుంది.

- సురేశ్‌ సాహు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని