మస్జిదులో మూత్రం పోశాడు...

ఒక పల్లెటూరి అరబ్బు మస్జిదులో ఓ మూల మూత్రం పోశాడు. అది చూసిన వారు అతడి మీద దాడి చేయబోయారు. ముహమ్మద్‌ ప్రవక్త (స) వారించి ‘ఇది దైవారాధన చేసే స్థలం.

Published : 22 Sep 2022 00:28 IST

క పల్లెటూరి అరబ్బు మస్జిదులో ఓ మూల మూత్రం పోశాడు. అది చూసిన వారు అతడి మీద దాడి చేయబోయారు. ముహమ్మద్‌ ప్రవక్త (స) వారించి ‘ఇది దైవారాధన చేసే స్థలం. ఇలాంటి పనులు చేయకూడదు’ అంటూ సున్నితంగా చెెప్పి అతణ్ణి వదిలేశారు. మూత్రం పోసిన చోట నీళ్లు పోయమని శిష్యులకు చెప్పి ‘మీరు వ్యవహారాలను చక్కబెట్టడానికి వచ్చారే కానీ క్లిష్టంగా మార్చడానికి కాదుగా’ అంటూ హితవు పలికారు. మృదువైఖరి, సహనం ముఖ్యమన్నదే ఆయన బోధల సారం. ‘దేవుడు కరుణామయుడు, మనలోనూ కారుణ్యాన్నే చూడాలనుకుంటాడు’ అంటూ సందేశమిచ్చారు.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని