నామ జప పారాయణ

నామపారాయణ గురించి సందేహాలు వస్తుంటాయి. భగవంతుణ్ణి సగుణరూపంతో ఆరంభించి, నిర్గుణ సాధనకు వెళ్తే ఫలితం బాగుంటుంది. రూపం కంటే నామం గొప్పది.

Published : 13 Oct 2022 00:29 IST

నామపారాయణ గురించి సందేహాలు వస్తుంటాయి. భగవంతుణ్ణి సగుణరూపంతో ఆరంభించి, నిర్గుణ సాధనకు వెళ్తే ఫలితం బాగుంటుంది. రూపం కంటే నామం గొప్పది. అది అంతఃకరణ ప్రవృత్తికీ, భగవంతుడికీ మధ్య సూత్రం. జనపనారతో తాడు తయారైనట్టు నామజపం వల్ల భగవంతుడితో బంధం బలపడుతుంది. గురువు నుంచి ఉపదేశం పొంది నామజపంచేస్తే సాధనలో వికల్పాలు ఎదురైనా గురుకృపతో తొలగుతాయి. అహం నశిస్తుంది. నామజపం ఎన్నాళ్లు చేయాలి? మధ్యలో మానేయొచ్చా? అనేది కొందరి సందేహం. నామజపంతో మనసు చెడుదారిలోకి మళ్లదు. మలినాలు తొలగి భగవత్‌ సాన్నిధ్యం దగ్గరవుతుంది. అరిషడ్వర్గాలు దహించుకుపోతాయి. అహాన్ని వదిలి శ్రద్ధాసక్తులతో చేసే నామజపం లక్ష్యంవైపు నడిపిస్తుంది. సాధకులకు నిష్ఠ అవసరం. ఉత్సాహంగా ప్రారంభించి తర్వాత ఆపేయటం తగదు. ప్రారంభంలో ఒక నిశ్చిత సంఖ్య వరకు జపం చేసే నియమం పెట్ట్టుకోవడం మంచిదే! అయితే ‘ఈ రోజు జపసంఖ్య పూర్తయింది. రేపటిదాకా నామంతో పనిలేదు’ అనుకోకూడదు. సాధ్యమైనంతసేపు చేస్తే మరింత ఆనందం అనుభూతికొస్తుంది.

- టి.వి.ఎల్‌.గాయత్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని