పరిపూర్ణ ఆనందం

సృష్టిలో ప్రతి మనిషి ఆనందం కోసం అహర్నిశలూ పాటుపడటం సహజం. పరిపూర్ణ ఆనందం అనేది ‘సంతృప్తి’ అన్న మూడక్షరాల్లో ఇమిడి ఉంది.

Updated : 15 Dec 2022 06:12 IST

సృష్టిలో ప్రతి మనిషి ఆనందం కోసం అహర్నిశలూ పాటుపడటం సహజం. పరిపూర్ణ ఆనందం అనేది ‘సంతృప్తి’ అన్న మూడక్షరాల్లో ఇమిడి ఉంది. ఉన్నంతలో సంతృప్తి చెందేవారికి ఆనందం వశమవుతుంది. అత్యాశకు లోనయ్యే వారిని దుఃఖం నీడలా వెంబడిస్తుంది.
ఒక శిష్యుడు తన గురువుతో ‘ఆర్యా! ఆనందం పొందడానికి సులభమార్గం ఉంటే చెప్పండి’ అనడిగాడు. గురువు నవ్వి ‘అటు చూడు నాయనా! ఆ బాలుడేం చేస్తున్నాడో గమనించి చెప్పు! ఇప్పుడా పిల్లవాడి ముందు బంగారు ఉంగరమో, మరేదైనా వస్తువో పడేస్తే కాసేపు దానితో ఆడుకుని ఆనక విసిరేస్తాడే గానీ విలువైందని దాచుకోడు. మనం కూడా పిల్లల మనస్తత్వం కలిగుండాలి. దేనిమీదా వ్యామోహం పెంచుకోకూడదు. ఈ మార్గాన్ని అనుసరిస్తే ఆనందాన్ని, సుఖశాంతులను పొందడం సులువు’ అంటూ సంశయం తీర్చాడు.                 

సాయి అనఘ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని