మాటిస్తే సరిపోదు...

మనలో చాలామంది అనేక సందర్భాల్లో అనేక విషయాలకు సంబంధించి వాగ్దానాలు చేస్తుంటారు. వాటిని ఎంతవరకూ అమలు చేస్తున్నారంటే సమాధానం సంతృప్తిగా ఉండదు

Published : 23 Mar 2023 00:08 IST

మనలో చాలామంది అనేక సందర్భాల్లో అనేక విషయాలకు సంబంధించి వాగ్దానాలు చేస్తుంటారు. వాటిని ఎంతవరకూ అమలు చేస్తున్నారంటే సమాధానం సంతృప్తిగా ఉండదు. చాలాసార్లు అవి నెరవేరవు. మాటిచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా అమలుపరచాలి, లేదంటే వాగ్దానం చేయనే కూడదు అన్నాడు (ప్రసంగి 5:5) ఏసుప్రభువు. ఇక బలహీనతల గురించి చెప్పనవసరమే లేదు.  యెఫ్తా రాజుకు ఒక మొక్కుబడి ఉంది. యుద్ధంలో జయం కలిగి రాజ్యానికి తిరిగి వచ్చాక.. తనకు మొదటగా కనిపించినదాన్ని దేవుడికి కృతజ్ఞతగా (న్యాయాధిపతులు 11:30) అర్పిస్తాడు. ఒకసారి అలాగే తిరిగొస్తున్నాడు. తండ్రికి ఘన స్వాగతం పలికేందుకు రాకుమార్తె సంతోషంగా ఎదురొచ్చింది. తన వాగ్దానం గుర్తొచ్చి రాజు దుఃఖితుడయ్యాడు. విషయం తెలుసుకున్న కూతురు తనకు కొంత సమయం ఇవ్వమంది. కొండ మీదికి వెళ్లి కొన్నాళ్లు పార్థనలు చేసి వచ్చి, తండ్రిని  వాగ్దానం నెరవేర్చుకోమంది. రాజు అలాగే చేశాడు. ఇచ్చిన మాట కోసం ప్రాణ సమానమైన కుమార్తెనూ సమర్పించిన అరుదైన ఘటన ఇది.            

మర్రి ఎ.బాబ్జీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని