పక్షుల పోషణా దేవుడిదే!

స్వాలో అనే చిన్ని పక్షులు- సంతాన వృద్ధి కోసం అర్జెంటీనాలో బయల్దేరి 8500 కి.మీ. పైచిలుకు దూరంలో ఉన్న కాలిఫోర్నియా చేరుకుంటాయి. అందుకోసం నెలల తరబడి ప్రయాణిస్తాయి.

Published : 05 Oct 2023 00:26 IST

స్వాలో అనే చిన్ని పక్షులు- సంతాన వృద్ధి కోసం అర్జెంటీనాలో బయల్దేరి 8500 కి.మీ. పైచిలుకు దూరంలో ఉన్న కాలిఫోర్నియా చేరుకుంటాయి. అందుకోసం నెలల తరబడి ప్రయాణిస్తాయి. అక్కడో సురక్షిత ప్రదేశాన్ని ఎన్నుకుని గుడ్లు పెట్టి, పొదుగుతాయి. సుమారు ఏడు నెలల తర్వాత పిల్లలతో స్వస్థలం చేరుకుంటాయి. అవి ఓ తేలికైన కర్రపుల్లను నోట కరచుకుని వెళ్తాయి. అలసినప్పుడు.. నీళ్ల మీద కర్రపుల్లను వేసి కాసేపు సేదతీరతాయి. తర్వాత ప్రయాణం కొనసాగిస్తాయి.

దేవుడు గుప్పెడంత ఉండే పక్షుల బాగోగుల గురించే ఇంత శ్రద్ధ వహిస్తున్నాడంటే.. తన ఊపిరితో తన లాంటి స్వరూపంతో సృష్టించిన మనపై ఇంకెంత శ్రద్ధ వహిస్తాడో కదా! కానీ, ఆయన వాత్సల్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబోలు! లేకుంటే.. సుఖసౌఖ్యాలూ, భోగభాగ్యాలూ అంటూ ఎందుకు వ్యాకులపడుతున్నాం? ఆయన చేసిన మేలు ఎలా మర్చిపోతున్నాం? ఒక చిన్న స్వాలో పక్షిని సైతం విస్మరించని సర్వోన్నతుడైన సృష్టికర్త.. మనల్ని పోషించలేడా? ఆ ప్రభువును విశ్వసిద్దాం, నిశ్చింతగా ఉందాం.    

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని