పరలోక ప్రాప్తి

దైవాన్ని నమ్ముకున్న వారు దిగులు పడనవసరమే లేదు. పరలోకరాజ్యం వారిదే- అన్నాడు ఏసు ప్రభువు. ఆయన వచ్చింది నిస్సహాయుల కోసం. అవగాహనా శూన్యులైన వారు అసలైన పేదలు. ‘యెహోవా ఆత్మ నాపై వాలింది, కేవలం దుఃఖించే వారిని ఓదార్చేందుకే’ అంటాడు ప్రభువు.

Published : 11 Jan 2024 00:10 IST

దైవాన్ని నమ్ముకున్న వారు దిగులు పడనవసరమే లేదు. పరలోకరాజ్యం వారిదే- అన్నాడు ఏసు ప్రభువు. ఆయన వచ్చింది నిస్సహాయుల కోసం. అవగాహనా శూన్యులైన వారు అసలైన పేదలు. ‘యెహోవా ఆత్మ నాపై వాలింది, కేవలం దుఃఖించే వారిని ఓదార్చేందుకే’ అంటాడు ప్రభువు. దావీదు అంతటి మహారాజు  దైవాన్ని దీనంగా ప్రార్థించాడు. రాజాధిరాజు అయినప్పటికీ ప్రభువు ముందు అతడు పేదవాడే. కొందరు ఎంత సంపాదించినా ఎలాంటి దర్పాలూ లేకుండా వినమ్రులుగా ఉంటారు. ప్రభువు అటువంటి వారిని చేరదీశాడు. ఆయన తన శిష్యులుగా ఆహ్వానించిన బెస్తవారు ధనం లేకున్నా.. మన్నన విషయంలో గొప్పవారు. తోవ పక్క అంధులు.. ‘దావీదు కుమారా! మా కన్నులు తెరిపించు’ అని వేడుకోగా.. వారికి చూపు ప్రసాదించాడు ప్రభువు. అహంభావం వీడితే వినయాన్ని ఆశ్రయించినట్టే. అటువంటి వారికి పరలోకం ప్రాప్తిస్తుంది.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని