ఏసుతో స్నేహం

నీ మిత్రుల గుణగణాలు నిన్ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. నువ్వు కూడా వారి వలెనే ప్రవర్తిస్తావు.

Published : 25 Jan 2024 00:02 IST

నీ మిత్రుల గుణగణాలు నిన్ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. నువ్వు కూడా వారి వలెనే ప్రవర్తిస్తావు. కనుక స్నేహం చేసేటప్పుడు మంచి వ్యక్తులను ఎంచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఈ భావంతోనే ‘నీ స్నేహితుడు ఎవరో తెలియజేస్తే.. నువ్వు ఎలాంటివాడివో చెబుతాను’ అనే నానుడి పుట్టింది. ‘కోపిష్టి వారితో స్నేహం వద్దు. అతని మార్గాలను అనుసరించి కష్టం కొనితెచ్చుకోవద్దు’ (సామెత 22:24:25) ‘జ్ఞానులతో స్నేహం చేస్తే వివేకం పెరుగుతుంది. అది మనకు శ్రేయస్సును కలిగిస్తుంది’ (సామెత 13:20) దేవుడు అబ్రహామ్‌ను స్నేహితుడిగా భావించాడు. అతడు దానికి తగినట్లుగా ఆయన ఆజ్ఞను వినమ్రతాభావంతో శిరసావహించాడు. పెద్ద వయసులో తనకు జన్మించిన ఒకే ఒక్క కుమారుని బలిగా అర్పించమంటే.. మారుమాట్లాడకుండా అందుకు సిద్ధపడ్డాడు. మనం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటామో అలా దేవుడు మోషేతో స్నేహంగా సంభాషించేవాడు. మోషే గొప్ప అదృష్టవంతుడు! దేవునితో స్నేహం చేసిన యెహోషువా ఆకాశంలో సూర్యచంద్రుల్ని కదలకుండా నిలువరించగలిగాడు. ప్రపంచంలో అదో గొప్ప వింత. ఏసుతో స్నేహం చేయాలంటే ఆయనతో ఏకాంతంగా గడపాలి. ఆయనకు మరింత సమీపంగా ఉండాలి. అనుభవ జ్ఞానంతో, నిగూఢమైన సంగతులు గ్రహించడానికి ఇది ఉపకరిస్తుంది. ఆ విధంగా ప్రభువుతో స్నేహం చేసినప్పుడు పైన ఉదహరించిన సాహసకార్యాలు మనం కూడా చేయగలం. 

పి.అవనీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని