క్షమించేద్దాం!

నిజమైన ముస్లిమ్‌లు మృదు స్వభావులు, సహనశీలులు, విశాల హృదయులై ఉండాలి. తోటి సహచరుల పట్ల వాత్సల్యం, కరుణ చూపాలి. ఇతరుల తప్పిదాలను భరించాలి.

Published : 29 Feb 2024 00:12 IST

ఇస్లాం సందేశం

నిజమైన ముస్లిమ్‌లు మృదు స్వభావులు, సహనశీలులు, విశాల హృదయులై ఉండాలి. తోటి సహచరుల పట్ల వాత్సల్యం, కరుణ చూపాలి. ఇతరుల తప్పిదాలను భరించాలి. ఎవరైనా సహించరాని విధంగా కఠోర వచనాలు పలికినా, అభాండాలు వేసినా, దౌష్ట్యాలకు పాల్పడినా, హింసించినా విశాల హృదయంతో వాటిని దాటేయాలి. కాఠిన్యం, పరుష సంభాషణ, ఆగ్రహ స్వభావం, ప్రతీకారం తీర్చుకోవాలన్న తపన లాంటివి శోభించవు. ఈ విషయాన్నే ప్రవక్త (స) వివరిస్తూ- ‘ప్రభువు నన్ను ఇలా ఆదేశించాడు- ‘ఎలాంటి పరిస్థితిలో అయినా న్యాయంగానే మాట్లాడాలి; నాకు దూరమయ్యేవారికి కూడా నేను చేరువవ్వాలి; నా హక్కు దక్కకుండా చేసేవారికి, తమ హక్కులు పొందేలా చేయాలి; నాపై దౌర్జన్యం చేసిన వారిని మన్నించాలి; నిత్యజీవితంలో మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పటికీ, అల్లాహ్‌ మన్నిస్తూనే, ఆదరిస్తూనే, ఆశించినవి అందజేస్తూనే ఉన్నాడు. తెలియక పొరపాటు చేస్తే.. పిడుగుపాటుకు గురిచేయడు. సరిదిద్దుకునే వ్యవధిని ఇస్తాడు. ఇది అల్లాహ్‌ క్షమాగుణ మహిమే. ప్రవక్తలు, సంస్కర్తలను ఆయన నిరంతరం ప్రభవింప జేస్తుంటాడు. తమ తప్పును తెలుసుకుని సన్మార్గాన్ని అవలంబించిన వారి అపరాధాలను మన్నిస్తాడు. అల్లాహ్‌ క్షమాగుణాన్ని ఆదర్శంగా తీసుకుని.. మనం కూడా మన్నించే లక్షణాన్ని అలవరచుకోవాలి. సహనశీలురు, విశాల హృదయులుగా మెలగాలి. ఇవే నైతిక ఆభరణాలు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షమించగలగడం సజ్జనుల లక్షణమని ఖురాన్‌ పేర్కొంది.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని