ధ్వజస్తంభం ఎందుకు?
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇది ఆలయ నిర్మాణంలో ఒక భాగం కనుక అన్ని దేవాలయాల్లోనూ ఉంటుంది. గర్భగుడిలో విగ్రహపు భూమధ్య స్థానం నుంచి 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తారు. ఆ కోణరేఖను
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇది ఆలయ నిర్మాణంలో ఒక భాగం కనుక అన్ని దేవాలయాల్లోనూ ఉంటుంది. గర్భగుడిలో విగ్రహపు భూమధ్య స్థానం నుంచి 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తారు. ఆ కోణరేఖను బట్టి ధ్వజస్తంభం ఎంత ఎత్తులో ఉండాలో నిర్ణయిస్తారు. స్వామికి, గోపురానికి మధ్యనున్న దూరాన్ని బట్టి 45 డిగ్రీల కోణరేఖ ఎంత ఎత్తులో ఉంటే, గోపుర శిఖర కొనను తాకుతుందో అంత ఎత్తు మాత్రమే గోపురం ఉండాలని నిర్ధారించారు. అప్పుడే దక్షిణ దిశాధిపతి అయిన కుజుని కిరణాలు స్వామివారి కనుబొమల మధ్య ప్రసరిస్తాయి. భక్తులు ధ్వజస్తంభానికి, స్వామివారికి మధ్యన నిలబడి నమస్కరించినపుడు దేవుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలా నియమిత ఎత్తు లేనప్పుడు కుజగ్రహ కిరణాలు స్వామివారి నుదుటి మీద ప్రసరించడానికి బదులు పరావర్తనం చెంది భక్తుల మీద పడతాయి. కనుక ఎత్తు, నిడివి, దూరం.. అన్నీ రేఖాగణిత సూత్రాలను అనుసరించి నిర్ణయమయ్యాయి. నియమాలను అనుసరించి నిర్దుష్టంగా ఆలయ నిర్మాణం సాగాలని పెద్దలు చెబుతారు.
- లేఖ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు