పక్కింటి పూలతో పూజ చేయొచ్చా?!

కొందరు ఉదయాన్నే వీధుల్లో నడుస్తూ పూలను తెంపి తీసుకెళ్లడం చూస్తుంటాం. అలా ఇతరుల చెట్ల పూలను వారి అనుమతి లేకుండా కోసి పూజ చేయడం మంచిది కాదు.

Published : 15 Sep 2022 00:43 IST

కొందరు ఉదయాన్నే వీధుల్లో నడుస్తూ పూలను తెంపి తీసుకెళ్లడం చూస్తుంటాం. అలా ఇతరుల చెట్ల పూలను వారి అనుమతి లేకుండా కోసి పూజ చేయడం మంచిది కాదు. ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతున్నదంటే..
తాంబూల ఫలపుష్పాది హర్తాస్యా ద్వానరో వనే ఉపాన తృణ కార్పా సహర్తాస్సాన్మేష యోనిషు అని గరుడ పురాణంలో స్వయంగా మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించాడు. తాంబూలం, ఫలాలు, పుష్పాలు మొదలైనవి అపహరిస్తే అడవిలో కోతిగా జీవిస్తారు. పాదుకలు, గడ్డి, పత్తి తదితరాలను అపహరిస్తే మేకగా జన్మిస్తారు- అని ఈ శ్లోకానికి అర్థం. ఒకరింటి పూలు అడగకుండా కోయడం దొంగతనం కిందే లెక్క. యజమాని అనుమతితో కోసినప్పటికీ పూజలో సగం ఫలితం వారికే చెందుతుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తాము పెంచుతున్న మొక్కలే అయినప్పటికీ వాటికున్న మొత్తం పుష్పాలను ఎన్నడూ కోయకూడదు. సగం కోసుకుని సగం చెట్లకే ఉంచాలనేది శాస్త్ర వచనం.

- విద్వాన్‌ టి.వి.శేషయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని