నూటైదుగురం
జూదంలో మెలకువలు తెలీని దుర్యోధనుడు శకునిని తోడుగా పెట్టుకుని మాయా జూదానికి ధర్మరాజును ఆహ్వానించాడు. అలా ధర్మజుడు ఓడిపోయాడు.
జూదంలో మెలకువలు తెలీని దుర్యోధనుడు శకునిని తోడుగా పెట్టుకుని మాయా జూదానికి ధర్మరాజును ఆహ్వానించాడు. అలా ధర్మజుడు ఓడిపోయాడు. తనూ ముందే ఆలోచించి కృష్ణుణ్ణి తోడుగా తీసుకుని జూదం ఆడి ఉంటే మహాభారత యుద్ధమే జరిగేది కాదనుకున్నాడు.
ధర్మజుడి వ్యక్తిత్వం హిమాలయాలకన్నా ఉన్నతం. ఒకసారి గంధర్వులు దుర్యోధనుణ్ణి తాళ్లతో బంధించి తీసికెళ్లారు. విషయం తెలియగానే ధర్మజుడు అర్జునుణ్ణి పిలిచి గంధర్వులతో పోరాడి దుర్యోధనుణ్ణి విడిపించుకు రమ్మన్నాడు. ‘మనల్ని ముప్పుతిప్పలు పెట్టి హింసించిన అతణ్ణి విడిపించడానికి నేను వెళ్లను గాక వెళ్లను’ అన్నాడు. ‘తమ్ముడూ! మామూలుగా మనం ఐదుగురం. వాళ్లు వందమంది. వాళ్లూ మనమూ దాయాదులు. ఇతరులు మనమీదికి వచ్చారంటే అందరం కలిసినూటైదుగురం’ అంటూ అర్జునుణ్ణి పంపాడు.
మంచినీళ్లకని జలాశయం దగ్గరికెళ్లిన నలుగురు సోదరుల్ని యక్షుడు విగతజీవుల్ని చేశాడు. వారిని వెతుక్కుంటూ వెళ్లిన ధర్మరాజుతో ‘నీ తమ్ముళ్లలో ఒకర్నే బతికిస్తాను. ఎవరు కావాలి?’ అని యక్షుడంటే నకులుణ్ణి బతికించమమన్నాడు. తన తల్లి సంతానాన్ని కాకుండా పినతల్లి కొడుకును అడిగాడు. ఒక్కరికే అవకాశం అన్నందున రెండో తమ్ముణ్ణి కోరలేదు. అలా సదా ధర్మాన్నే అనుసరించాడు.
సాయి అనఘ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!