అహల్య గాథ.. అసలు సందేశం

ఒకప్పుడు సత్యవర్ష మహర్షి అనే జ్ఞానపురుషుడు ఓ అరణ్యంలో కుటీరం ఏర్పరచుకుని వేదపాఠాలు నేర్పేవాడు.

Published : 16 Feb 2023 00:21 IST

కప్పుడు సత్యవర్ష మహర్షి అనే జ్ఞానపురుషుడు ఓ అరణ్యంలో కుటీరం ఏర్పరచుకుని వేదపాఠాలు నేర్పేవాడు. ఒకసారి ఓ శిష్యుడు ‘గురుదేవా! ఎంతోకాలంగా నన్నో సంశయం పట్టిపీడిస్తోంది. దేవేంద్రుడిది తేజోమయ దివ్య దేహం. అహల్యది మట్టిదేహం. ఈ రెంటికీ సాంగత్యం కుదరదు కదా! మరి దీని గురించి ఎలా అర్థంచేసుకోవాలి? దయచేసి తమరు నా సంశయాన్ని తీర్చండి’ అనడిగాడు.

‘నాయనా! భావపరమైన మోహానికి పాల్పడింది అహల్య. దాంతో భర్త శపించాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆమె ఆకలి దప్పులు లేని శిలామూర్తిగా పడి ఉంది. ఆ ప్రాయశ్చిత్త క్రియ వల్ల తన మానసిక దోషాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసుకుంది. అది చాలక పరమ పావనమైన శ్రీరామచంద్రుడి పాదస్పర్శకూ నోచుకుంది. అందువల్లనే ఆమె కడిగిన ముత్యంలా ప్రకాశించింది. పతివ్రతా శిరోమణుల్లో తొలి స్థానాన్ని అందుకుని పూజ్యురాలయింది. మానసిక దోషానికే అంత ప్రాయశ్చిత్తం చేసు కున్నదంటే ఇక తీవ్ర దోషగుణాలు ఆవరించకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుందీ ఉదంతం’ అంటూ వివరించాడు మహర్షి.

శివరాజేశ్వరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు