నోటీస్‌బోర్డు

ఏపీవీవీపీ - 896 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు...

Published : 22 Nov 2021 00:47 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీవీవీపీ - 896 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన అమరావతిలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన (ఏపీవీవీపీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 896

1) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టులు: 794 విభాగాలు: గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ తదితరాలు.

2) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌: 86

3) డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 16

అర్హత: పోస్టుల్ని అనుసరించి బీడీఎస్‌, ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: మొదటి మూడేళ్ల ప్రొబేషన్‌ కాలంలో నెలకు రూ.53500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 01.

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 376 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 376

పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు-326, ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు-50

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 01.11.2021 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్‌/ ఇతర పద్ధతుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 09.

వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/


ఐఎంఏ, దెహ్రాదూన్‌లో 188 ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలిటీరీ అకాడమీ (ఐఎంఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 188

పోస్టులు: కుక్‌, ఎంటీ డ్రైవర్‌, బుక్‌ మేకర్‌/ రిపెయిరర్‌, ఎల్‌డీసీ, మసాల్చి, వెయిటర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యం, అనుభవం.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2021, నవంబరు 20-26)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


సీ-డ్యాక్‌లో 111 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ముంబయిలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 111

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-97, ప్రాజెక్ట్‌ మేనేజర్లు-14.

విభాగాలు: సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఐటీ సెక్యూరిటీ, సెక్యూరిటీ అనాలసిస్‌, క్వాలిటీ అజ్యూరెన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 09.

వెబ్‌సైట్‌: www.cdac.in/


సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో...

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 115

పోస్టులు: ఎకనమిస్ట్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఏసీఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, నవంబరు 23.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 17.

వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/en


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని