నోటీస్ బోర్డు

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 31 Jan 2022 05:44 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సీఐఎస్‌ఎఫ్‌లో 1149 కానిస్టేబుల్‌ పోస్టులు

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* కానిస్టేబుల్‌/ ఫైర్‌ (మేల్‌)

మొత్తం ఖాళీలు: 1149 తెలుగు రాష్ట్రాల్లో

ఖాళీలు: తెలంగాణ-30, ఆంధ్రప్రదేశ్‌-79.

అర్హత: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 04.03.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 04.

వెబ్‌సైట్‌: https://cisfrectt.in/


ఎన్‌టీపీసీలో 177 పోస్టులు

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ)కు చెందిన ఝార్ఖండ్‌లోని కోల్‌ మైనింగ్‌ హెడ్‌క్వార్టర్స్‌ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 177

పోస్టులు-ఖాళీలు: మైనింగ్‌ ఓవర్‌మెన్‌-74, మైనింగ్‌ సిర్దార్‌-103.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో డీజీఎంఎస్‌ జారీ చేసిన సర్టిఫికెట్‌ ఉండాలి.  

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 15.

వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/


ఎన్‌హెచ్‌ఎం, తెలంగాణలో...

తెలంగాణలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయం (సీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రాం ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 29

పోస్టులు-ఖాళీలు: డిస్ట్రిక్ట్‌ డేటా మేనేజర్లు (డీడీఎం)-23, డిస్టిక్ట్ర్‌ అకౌంట్‌ మేనేజర్లు (డీఏఎం)-06.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ప్రొఫైల్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జనవరి 31.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 10.

వెబ్‌సైట్‌: https://chfw.telangana.gov.in/


టెలీకమ్యూనికేషన్స్‌ విభాగంలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* యంగ్‌ ప్రొఫెషనల్స్‌  

మొత్తం ఖాళీలు: 20

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 23.

వెబ్‌సైట్‌: https://dot.gov.in/


ఐసీఎస్‌ఐఎల్‌లో 46 సూపర్‌వైజర్లు

న్యూదిల్లీలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఐసీఎస్‌ఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సూపర్‌వైజర్లు (ఫిమేల్‌)

మొత్తం ఖాళీలు: 46

అర్హత: సోషియాలజీ/ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌/ న్యూట్రిషన్‌/ సోషల్‌ వర్క్‌లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటరాక్షన్‌/ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 02.

వెబ్‌సైట్‌: http://icsil.in/


యూసీఐఎల్‌లో 38 మైనింగ్‌ మేట్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మైనింగ్‌ మేట్‌

మొత్తం ఖాళీలు: 38

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన వాలిడ్‌ మైనింగ్‌ మేట్‌ సర్టిఫికెట్‌, పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: http://www.ucil.gov.in/


ప్రవేశాలు

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు 1) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - రూరల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఆర్‌ఎం) 2022-2024  2) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఆర్‌డీఎం) 2022-2023

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ ఏటీఎంఏ/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌ వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 10.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని