నోటీస్‌బోర్డు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 14 Mar 2022 06:48 IST

ఉద్యోగాలు

యూపీఎస్సీ- 45 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 45

పోస్టులు: అసిస్టెంట్‌ ఎడిటర్‌, ఫొటోగ్రాఫిక్‌ ఆఫీసర్‌, సైంటిస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్లు తదితరాలు.

విభాగాలు: పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌, టాక్సికాలజీ, పబ్లిక్‌ రిలేషన్స్‌, గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఈఎస్‌ఐసీలో 93 ఖాళీలు

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు/ మేనేజర్‌ గ్రేడ్‌-2/ సూపరింటెండెంట్‌

మొత్తం ఖాళీలు: 93

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కామర్స్‌/ లా/ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్స్‌కి ప్రాధాన్యం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌.

వయసు: 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 12.

వెబ్‌సైట్‌: www.esic.nic.in/


తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో...

నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రాం కింద తెలంగాణలోని టీఎస్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34

పోస్టులు-ఖాళీలు: ఐసీటీసీ కౌన్సెలర్‌-16, డీఎస్‌ఆర్‌సీ కౌన్సెలర్‌-10, ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్లు-08.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ (ఎంఎల్‌టీ), పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.

వెబ్‌సైట్‌: https://tsacs.telangana.gov.in/


సిపెట్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పోస్టులు: లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్లు, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, ఇన్‌స్ట్రక్టర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.

వెబ్‌సైట్‌: www.cipet.gov.in/


ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 137 పోస్టులు

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 137

పోస్టులు-ఖాళీలు: ఆపరేటర్‌ (కెమికల్‌ ట్రెయినీ)-133, జూనియర్‌ ఫైర్‌మెన్‌-04.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఫైర్‌మెన్‌ సర్టిఫికెట్‌ కోర్సు, బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 14.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 28.

వెబ్‌సైట్‌: www.rcfltd.com/


ప్రవేశాలు

ఎస్‌వీయూ, తిరుపతిలో...

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీయూ)కి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* ఎస్‌వీయూలో దూర విద్య ప్రవేశాలు

యూజీ ప్రోగ్రాములు: బీఏ, బీఎస్సీ, బీకాం (జనరల్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బీఎల్‌ఐఎస్సీ.

పీజీ ప్రోగ్రాములు: ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఎకనమిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.

ఎమ్మెస్సీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, సైకాలజీ, మ్యాథమేటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.

పీజీ డిప్లొమా కోర్సులు: ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ అండ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.

వెబ్‌సైట్‌: https://svudde.in/


అప్రెంటిస్‌షిప్‌

బెల్‌, మచిలీపట్నంలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), మచిలీపట్నం యూనిట్‌ (ఏపీ)లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఐటీఐ అప్రెంటిస్‌లు

శిక్షణ వ్యవధి: ఏడాది. ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ టెస్ట్‌ (రాత పరీక్ష) ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేది: 2022, మార్చి 20.

వేదిక: లేడీ యంపథిల్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, రామానాయుడు పేట, మచిలీపట్నం-521001.

వెబ్‌సైట్‌: www.bel-india.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని