నోటిఫికేషన్స్‌

తెలంగాణ రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, పీజీలాసెట్‌ ప్రకటన విడుదలైంది....

Published : 05 Apr 2022 01:13 IST

ప్రవేశాలు
టీఎస్‌ లాసెట్‌/ టీఎస్‌ పీజీఎల్‌సెట్‌-2022

తెలంగాణ రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, పీజీలాసెట్‌ ప్రకటన విడుదలైంది.
తెలంగాణ స్టేట్‌ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌
కోర్సులు: ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు/ ఐదేళ్లు), ఎల్‌ఎల్‌ఎం ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 06. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 06. పరీక్ష తేదీలు: 2022, జులై 21, 22.

వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/


ఐసర్‌ - బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసర్‌) 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: ఐదేళ్లు. అందిస్తున్న ప్రోగ్రాములు: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎకనమిక్‌ సైన్సెస్‌ తదితరాలు. అందిస్తున్న సంస్థలు: బెర్హంపూర్‌, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి. అర్హత: 2021/ 2022లో ఏదైనా సైన్స్‌ విభాగంలో ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక విధానం: కేవీపీవై/ జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) స్కోర్‌/ ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఐఏటీ 2022) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 25. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20. ఐసర్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేది: 2022, జూన్‌ 12.

వెబ్‌సైట్‌: http://iiseradmission.in/


నైపర్‌ - జేఈఈ 2022

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) 2022 విద్యాసంవత్సరానికి గాను నైపర్‌ జేఈఈ-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఫార్మసీ విద్యలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అందిస్తున్న కోర్సులు: ఎంఫార్మసీ, ఎంఎస్‌ (ఫార్మా), ఎంటెక్‌ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్‌డీ. నైపర్‌ క్యాంపస్‌లు: అహ్మదాబాద్‌, గువహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్‌. విభాగాలు: బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, టాక్సికాలజీ తదితరాలు. అర్హత: ప్రోగ్రాములని అనుసరించి బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. జీప్యాట్‌/ గేట్‌/ నెట్‌ జాతీయ పరీక్షల అర్హత. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 03. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) తేది: 2022, జూన్‌ 12.

వెబ్‌సైట్‌: ‌ www.niperhyd.ac.in/


నల్సార్‌లో ఎంబీఏ ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా కు చెందిన మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం 2022-2024 విద్యాసంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాములో ప్రవేశాలకు  దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కార్పొరేట్‌ గవర్నెన్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, కోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022/ జీమ్యాట్‌ (జూన్‌ 2020 తర్వాత)/ జీఆర్‌ఈ (జూన్‌ 2020 తర్వాత)/ సీమ్యాట్‌ 2022 స్కోర్‌. ఎంపిక విధానం: నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌-మెట్‌)/ క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోర్‌, అకడమిక్‌ క్రెడెన్షియల్స్‌, ప్రొఫెషనల్‌ అచీవ్‌మెంట్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 28. ఎన్‌-మెట్‌ పరీక్ష తేది: 2022, మే 01.

వెబ్‌సైట్‌: https://doms.nalsar.ac.in/


బీఈసీఐఎల్‌లో కొలువులు

భారత ప్రభుత్వానికి చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 86 పోస్టులు: మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అటెండెంట్‌, క్యాషియర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 21.

వెబ్‌సైట్‌: ‌www.becil.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని