నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 20 Jul 2022 02:47 IST

ఉద్యోగాలు
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఆఫీసర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్లు (మార్కెటింగ్‌) మొత్తం పోస్టులు: 18

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో రెగ్యులర్‌ అండ్‌ ఫుల్‌ టైం సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేషన్‌/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ (మార్కెటింగ్‌) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 34 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.40000-రూ.1,40,000.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 2022, జులై 23.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 12.

వెబ్‌సైట్‌: https://www.rcfltd.com/


బెంగళూరులో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు. మొత్తం ఖాళీలు: 150

విభాగాలు: ఈసీఈ, మెకానికల్‌, ఈఈఈ, సీఎస్‌.

అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌

వయసు: ఆగస్టు 01, 2022 నాటికి 28-32 ఏళ్లు మధ్య ఉండాలి.వేతనం నెలకు రూ.30000-రూ.40000.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 03, 2022.

వెబ్‌సైట్‌:  https://www.belnindia.in/


ప్రవేశాలు

ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ఫార్మసీ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన ఆంధ్రప్రదేశ్‌/ తెలంగాణ(15%) రాష్ట్ర అభ్యర్థులు  డి.ఫార్మసీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఇంటర్మీడియట్‌(బైపీసీ/ ఎంపీసీ)/ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు పరీక్ష ఉత్తీర్ణత.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జులై 20, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 03, 2022.

వెబ్‌సైట్‌: https://dteap.nic.increens/Mainhome.aspx


వాక్‌ఇన్‌

హైదరాబాద్‌ బెల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన వాటర్‌ ఫ్రంట్‌ సపోర్ట్‌ లొకేషన్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1(ఎల‌్రక్టానిక్స్‌/ మెకానికల్‌)

21 పోస్టులు అర్హత: బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

పని ప్రదేశాలు: విశాఖపట్నం, ముంబయి, కొచ్చిన్‌, కార్వార్‌, పోర్ట్‌ బ్లెయిర్‌.

వయసు: జులై 01, 2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.472.ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 27, 2022.

ఇంటర్వ్యూలు: ఆగస్టు 06, 2022-పోర్ట్‌ బ్లెయిర్‌, ఆగస్టు 10, 2022-విశాఖపట్నం, ఆగస్టు 17, 2022- ముంబయి.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


ఆదిలాబాద్‌ రిమ్స్‌లో బోధనా ఖాళీలు

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సీఏఎల్‌- ఆర్‌ఎంవో, సీఎంవో తదితరాలు.

విభాగాలు: అనాటమీ, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత.

వయసు: 65 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ వేదిక: వేదిక: రిమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, ఆదిలాబాద్‌.

ఇంటర్వ్యూ తేది: జులై 23, 2022.

వెబ్‌సైట్‌: http://rimsadilabad.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు