నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డైరెక్ట్‌, లేటరల్‌ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

Published : 18 Aug 2022 01:21 IST
ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డైరెక్ట్‌, లేటరల్‌ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (డైరెక్ట్‌): 375 పోస్టులు
2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (లేటరల్‌ ఎంట్రీ): 247 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, ఎండీ, ఎండీఎస్‌, డీఎం, ఎంహెచ్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 04-08-2022 నాటికి జనరల్‌ అభ్యర్థులు- 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు- 47 ఏళ్లు, దివ్యాంగులు- 52 ఏళ్లు, మాజీ సైనికులు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: పీజీ డిగ్రీ, సూపర్‌ స్పెషాలిటీ ఉత్తీర్ణత మార్కులు, అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన సంవత్సరం, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు సర్వీసు తదితరాలకు వెయిటేజీ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1500 (బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.08.2022.

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


341 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

వైద్య ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 341 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి ఏపీ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

స్పెషాలిటీల వారీగా ఖాళీలు...

* గైనకాలజీ: 60 పోస్టులు *  అనస్తీషియా: 51  *  పీడియాట్రిక్స్‌: 51 *  జనరల్‌ మెడిసిన్‌: 75 *  జనరల్‌ సర్జరీ: 57 *  రేడియాలజీ: 27 *  పాథాలజీ: 08 *  ఈఎన్‌టీ: 09 *  ఫోరెన్సిక్‌ మెడిసిన్‌: 03 పోస్టులు

అర్హతలు: పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణత.

ఎంపిక: అర్హత పరీక్ష, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

వయసు: ఈ ఏడాది జూలై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.08.2022.

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ...

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్‌ ఏవియేషన్‌, కంజ్యూమర్‌ అఫైర్స్‌, డిఫెన్స్‌ తదితర శాఖల్లో 37 ఖాళీల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (రెగ్యులేషన్స్‌ ఖీ ఇన్ఫర్మేషన్‌): 02 పోస్టులు *  డిప్యూటీ డైరెక్టర్‌: 04 *  సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 01 *  ఫొటోగ్రాఫిక్‌ ఆఫీసర్‌: 01 *  సీనియర్‌ ఫొటోగ్రాఫిక్‌ ఆఫీసర్‌: 01 *  జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(ఫిజిక్స్‌): 01 *  జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (న్యూట్రాన్‌ యాక్టివేషన్‌ అనాలిసిస్‌): 01 *  సీనియర్‌ గ్రేడ్‌ (ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌): 22 *  ప్రిన్సిపల్‌ (రైల్వే డిగ్రీ కాలేజ్‌): 01 *  డైరెక్టర్‌ (నేషనల్‌ అట్లాస్‌ అండ్‌ థిమాటిక్‌ మ్యాపింగ్‌ ఆర్గనైజేషన్‌): 01 *  ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌)/ సర్వేయర్‌ ఆఫ్‌ వర్క్స్‌(సివిల్‌): 02 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి,  డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01.09.2022.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


ప్రభుత్వాసుపత్రుల్లో 132  పారా మెడికల్‌ పోస్టులు

మ్మడి గుంటూరు జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 132 పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* డెంటల్‌ టెక్నీషియన్‌: 01 పోస్టు *  డైటీషియన్‌: 01 *  రేడియోగ్రాఫర్‌: 15 *  ఈసీజీ టెక్నీషియన్‌: 01 *  ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌: 02 *  జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ (జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో): 36 *  మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌: 02 *  ల్యాబ్‌ అటెండెంట్‌: 04 *  ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 11 *  ఆఫీస్‌ సబార్డినేట్‌: 14 *  ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: 13 *  ఫిజియోథెరపిస్ట్‌: 01 *  ప్లంబర్‌: 03 *  శానిటరీ వర్కర్‌ కమ్‌ వాచ్‌మెన్‌: 13 *  ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ: 06 *  ఓటీ టెక్నీషియన్‌ (థియేటర్‌ అసిస్టెంట్‌): 09 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.250. ఎంపిక: విద్యార్హత పరీక్ష మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2022.

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు