నోటిఫికేషన్స్

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌(ఆర్‌డీఎస్‌ఎస్‌)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 17 Nov 2022 00:10 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

800 ఫీల్డ్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌లు

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌(ఆర్‌డీఎస్‌ఎస్‌)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
1. ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 50 పోస్టులు
2. ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌): 15 పోస్టులు
3. ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఐటీ): 15 పోస్టులు
4. ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రికల్‌): 480 పోస్టులు
5. ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌): 240 పోస్టులు
మొత్తం ఖాళీలుË: 800.
వయసు: 11.12.2022 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రారంభం: 21.11.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 11.12.2022.
వెబ్‌సైట్‌: https://www.powergrid.in/recruitmentn


గోవా షిప్‌యార్డులో కన్సల్టెంట్‌ పోస్టులు

వాస్కో-డ-గామాలోని గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.కన్సల్టెంట్‌: 11 పోస్టులు
విభాగాలు: హెచ్‌వీఏసీఆర్‌, కమర్షియల్‌, ఫ్రిగేట్స్‌ - బీ అండ్‌ డీ స్పేర్స్‌, టెక్నికల్‌ సర్వీసెస్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఫైనాన్స్‌.
వయసు: 31.10.2022 నాటికి 63 సంవత్సరాలు మించకూడదు.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌అండ్‌ఎ), డా.బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌, గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, వాస్కో-డ-గామా, గోవా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2022.
వెబ్‌సైట్‌: https://goashipyard.in/


జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ… ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్‌ అసిస్టెంట్‌: 15 పోస్టులు
అర్హత: సీనియర్‌ సెకండరీ (10+2) ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ నైపుణ్యం.
వయసు: 27 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-12-2022.
దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 12-12-2022.
వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/


అప్రెంటిస్‌షిప్‌

బీడీఎల్‌, సంగారెడ్డిలో 119 అప్రెంటిస్‌లు

సంగారెడ్డి జిల్లా భానూర్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌)… డిప్లొమా అప్రెంటిస్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 83 ఖాళీలు
2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 36 ఖాళీలు
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత.
విభాగాలు: మెకానికల్‌, సీఎస్‌ఈ/ ఐటీ, ఈసీఈ, ఈఈఈ, సివిల్‌, ఈఐఈ, కెమికల్‌.
స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ వ్యవధి: సంవత్సరం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2022.
వెబ్‌సైట్‌: https://bdl-india.in/apprentice-connect


వాక్‌ ఇన్‌ ఇంటర్వూ

ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌లో..

రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, చెన్నై అసిస్టెంట్‌ మేనేజర్‌/ ఎగ్జిక్యూటివ్‌/ ట్రైనీ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌, అనంతపురంలో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఇంగ్లిషుతో పాటు తెలుగు భాషపై పట్టు ఉండాలి. హిందీ పరిజ్ఞానం అదనపు ప్రయోజనం.
వయసు: 01-11-2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశాలు: అనంతపురం, హబ్సిగూడ, హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, పటాన్‌చెరు, వరంగల్‌.
ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలు:
18-11-2022: ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌, అనంతపురం బ్రాంచ్‌, ఫ్లాట్‌ నం.203, 2వ అంతస్తు, గిరీష్‌ టవర్స్‌, సాయి నగర్‌, అనంతపురం.
19-11-2022: ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌, హైదరాబాద్‌ బ్రాంచ్‌, 102, 1వ అంతస్తు, ఎంహెచ్‌ఆర్‌ హౌస్‌, సంజీవరెడ్డి నగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://repcohome.com/careers


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు