ఆన్‌లైన్‌లో 700పైగా  ఉచిత కోర్సులు

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండి, విసిగిపోతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ లర్నింగ్‌ వేదిక ‘యుడెమి’ సాయం అందిస్తానంటోంది. 50 మిలియన్ల విద్యార్థులూ, 57 వేలమంది ఇన్‌స్ట్రక్టర్లతో 65కు పైగా భాషల్లో ఈ సంస్థ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత సమయాన్ని కెరియర్‌/ అభిరుచుల పరంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా 700కుపైగా స్వల్పకాలిక కోర్సులను ఉచితంగా అందిస్తోంది.

Updated : 21 Apr 2020 01:12 IST

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండి, విసిగిపోతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ లర్నింగ్‌ వేదిక ‘యుడెమి’ సాయం అందిస్తానంటోంది. 50 మిలియన్ల విద్యార్థులూ, 57 వేలమంది ఇన్‌స్ట్రక్టర్లతో 65కు పైగా భాషల్లో ఈ సంస్థ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత సమయాన్ని కెరియర్‌/ అభిరుచుల పరంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా 700కుపైగా స్వల్పకాలిక కోర్సులను ఉచితంగా అందిస్తోంది. కోర్సులు ఇంగ్లిష్‌తోపాటు కొన్ని హిందీలోనూ అందుబాటులో ఉన్నాయి.
నేర్చుకోవడం ద్వారానే జీవితం అభివృద్ధి చెందుతుందన్నది.. యుడెమి ఉద్దేశం. అనుకోకుండా అందివచ్చిన ఈ విరామ సమయాన్నీ చక్కగా సద్వినియోగం చేసుకోమంటోంది. ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా 700కు పైగా కోర్సులను అందుబాటులో ఉంచింది. కెరియర్‌కు తోడ్పడే కొత్త కోర్సులు, నైపుణ్యాలతోపాటు జీవితకాల అభిరుచులు.. ఇలా వివిధ అంశాలు దీనిలో ఉన్నాయి. విద్యార్థులతోపాటు వృత్తి నిపుణులూ వీటిని అభ్యసించవచ్చు.

* సాంకేతిక నైపుణ్యాలపై ఆసక్తి ఉన్నవారికి వర్డ్‌ప్రెస్‌, ఎక్సెల్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, ఎస్‌ఈఓ, సీ++, వెబ్‌డెవలప్‌మెంట్‌, సీఎస్‌ఎస్‌, అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌, బ్లాక్‌చైన్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌ ఫండమెంటల్స్‌, అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌, బూట్‌స్ట్రాప్‌ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.
* అభిరుచి, కెరియర్‌ మెరుగుదల కోసం చూసేవారు ఫొటోగ్రఫీ, మెడిటేషన్‌, పర్సనల్‌ ప్రొడక్టివిటీ, పర్సనల్‌ డెవలప్‌మెంట్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఫండమెంటల్స్‌, గోల్‌ సెట్టింగ్‌, ఫిట్‌నెస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మొదలైనవాటిల్లో కోర్సులను ఎంచుకోవచ్చు.
కోర్సుల్లో సబ్‌ కేటగిరీలూ ఉన్నాయి. ఇవన్నీ ప్రారంభ, మధ్యస్థ, నైపుణ్య స్థాయుల్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి తనకు నచ్చినదాన్ని ఆసక్తి ఉన్న పరిధిలో ఎంచుకోవచ్చు. కోర్సులన్నీ ఆంగ్లభాషలో  ఉన్నాయి. హిందీ భాషతోపాటు విదేశీ భాషల్లోనూ కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనుభవమున్నవారు వీటిని బోధిస్తున్నారు. కోర్సులన్నీ గంటల నుంచి రోజుల పరిధిలో ఉంటాయి.
ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌ 
(www.udemy.com/courses/free/) లో సైన్‌అప్‌ అవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


మూడు రకాలుగా..

1) పర్సనల్‌ గ్రోత్‌ అండ్‌ వెల్‌నెస్‌

2) ప్రొడక్టివిటీ అండ్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్‌

3) ఎసెన్షియల్‌ టెక్‌స్కిల్స్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని