ప్రఖ్యాత సంస్థల్లో పీజీలు... పీహెచ్‌డీలు!

సరైన దిశానిర్దేశం లేకపోతే పరిశోధనలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. అందులోనూ పీహెచ్‌డీలకు నిపుణుల పర్యవేక్షణ అత్యవసరం. నిష్ణాతులైన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో డాక్టరేట్‌ పొందే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇంజినీరింగ్‌, సైన్స్‌ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏసీఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 13 May 2020 01:57 IST

ఏసీఎస్‌ఐఆర్‌ ప్రకటన విడుదల

సరైన దిశానిర్దేశం లేకపోతే పరిశోధనలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. అందులోనూ పీహెచ్‌డీలకు నిపుణుల పర్యవేక్షణ అత్యవసరం. నిష్ణాతులైన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో డాక్టరేట్‌ పొందే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇంజినీరింగ్‌, సైన్స్‌ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏసీఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దేశంలోనే ప్రసిద్ధి చెందిన 42 కేంద్రాల్లో సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుకోడానికీ, పరిశోధనలు చేయడానికీ అవకాశం వచ్చింది. జాతీయ ప్రాధాన్య సంస్థగా ఆవిర్భవించిన అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రిసెర్చ్‌ (ఏసీఎస్‌ఐఆర్‌) ప్రకటన విడుదల చేసింది. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ -పీహెచ్‌డీ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది. పరిశోధనల్లో కెరియర్‌ కొనసాగించాలనుకునే వారికి ఇది అనువైన, విలువైన మార్గం.

సాధారణ విశ్వ విద్యాలయాలకు భిన్నమైన విభాగాల్లో పరిశోధనలకు ఏసీఎస్‌ఐఆర్‌ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం పరిశోధనాత్మక, సరికొత్త పాఠ్యప్రణాళికను రూపొందించింది. బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్సెస్‌ల్లో కోర్సులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలలు, 6 సీఎస్‌ఐఆర్‌ యూనిట్లు వివిధ సబ్జెక్టుల కోసం ఈ సంస్థ వాస్తవ క్యాంపస్‌లుగా వ్యవహరిస్తాయి. దాదాపు రెండువేల అయిదువందల మంది నిపుణుల ఆధ్వర్యంలో బోధన జరుగుతుంది.

కోర్సులవారీగా అర్హతలు

పీహెచ్‌డీ: ఇంజినీరింగ్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ అందిస్తున్నారు. బీటెక్‌/ ఎంటెక్‌ లేదా సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు సీఎస్‌ఐఆర్‌, యూజీసీ, డీఎస్‌టీ, డీబీటీ వీటిలో ఎందులోనైనా జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించినవారై ఉండాలి.

ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ పీహెచ్‌డీ: బీటెక్‌ లేదా ఎమ్మెస్సీ పూర్తిచేసినవారు అర్హులు. జేఆర్‌ఎఫ్‌ లేదా గేట్‌, నెట్‌ ఎందులోనైనా అర్హత సాధించాలి.

ఎంటెక్‌: బీటెక్‌ లేదా నాలుగేళ్ల సైన్స్‌ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ ఉండాలి. నెట్‌, గేట్‌ ఇలా ఏదైనా జాతీయ పరీక్షలో అర్హత సాధించాలి.

ఎమ్మెస్సీ: సైన్స్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ తదితరాల్లో ఎందులోనైనా బ్యాచిలర్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక విధానం

ప్రతి ప్రోగ్రామ్‌కి ఒక దరఖాస్తు మాత్రమే పంపాలి. ఏ దశలోనైనా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని గుర్తిస్తే వెంటనే అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ లేదా రెండింటికీ పిలుస్తారు. వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోలు, గ్రూప్‌-4 సైంటిస్టులు, సీఎస్‌ఐఆర్‌లోని గ్రూప్‌-3 టెక్నికల్‌ సిబ్బంది తమ అర్హతలను అనుసరించి ఏసీఎస్‌ఐఆర్‌ నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవచ్ఛు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 28, 2020.

వెబ్‌సైట్‌: http://acsir.emli.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని