Published : 12 Oct 2018 19:10 IST

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

 

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌శాల ‘ఇంటర్న్‌షిప్స్‌ ఫర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌’ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది. మొదటి సంవత్సరం చదువుతున్న ఏ డిగ్రీ విద్యార్థులైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా లక్షలమంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరుతుండగా వారిలో 8-10% మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. అందుకే ఈ ప్రత్యేక ఇంటర్న్‌షిప్‌ల ద్వారా తగిన నైపుణ్యాలను చేజిక్కించుకుని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు. ఈ ప్రత్యేక ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులు ప్రయోగాత్మక అనుభవంతోపాటు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికీ వీలుంటుంది. 
మార్కెటింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఇతర సంబంధిత ప్రొఫైళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్చువల్‌ లేదా వర్క్‌ ఫ్రం హోంలలో విద్యార్థి తనకు నచ్చిన విధానం ద్వారా పనిచేయవచ్చు. వీటికి ఇతర ఇంటర్న్‌షిప్‌ల్లా ప్రత్యేకమైన నైపుణ్యాలేం అవసరం లేదు. ప్రాథమిక భావప్రకటన (కమ్యూనికేషన్‌), రాత నైపుణ్యాలు ఉన్నవారెవరైనా అర్హులే. సెప్టెంబరు 26, 2018లోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27, 28 తేదీల్లో ఈ ఇంటర్న్‌షిప్‌లకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నవారికే ఈ ఇంటర్న్‌షిప్‌లను దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఎంపికైన విద్యార్థుల వివరాలను అక్టోబరు 31లోపు ప్రకటిస్తారు. 
ఇతర వివరాలకు https://internshala.com/internships-for-1st-yearstudents లింకును చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు