మంచి నిర్ణయమేనా?

హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేశాను. పెళ్లి తరువాత ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో పెద్దగా సంస్థలేమీ లేవు. హాస్పిటల్‌ / కాలేజీల్లో హెచ్‌ఆర్‌గా

Published : 30 Nov 2020 01:12 IST

హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేశాను. పెళ్లి తరువాత ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో పెద్దగా సంస్థలేమీ లేవు. హాస్పిటల్‌ / కాలేజీల్లో హెచ్‌ఆర్‌గా ప్రయత్నిద్దామనుకుంటున్నా. ఇది మంచి నిర్ణయమేనా? కెరియర్‌ ఎలా ఉంటుంది?

- స్నేహ. కె

హెల్త్‌కేర్‌ రంగంలో కూడా ఇతర రంగాల మాదిరిగానే మేనేజర్‌లకు ప్రాధాన్యం ఉంది. వైద్యశాలలో రోగులకు ప్రత్యక్షంగా సేవలు అందించనప్పటికి, వారికి అందే వైద్యానికి సంబంధించిన నాణ్యత, ఇతర విషయాలపై వీరు విలువైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్పత్రి సిబ్బందిని నియమించడం, వారి వేతనాలు, ఉద్యోగానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడంలో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. దీనితో పాటు సిబ్బంది శిక్షణను కూడా వీరే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక కాలేజీల విషయానికి వస్తే నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను వెతకడం, వారిని నియమించడంలో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. ఇక మీ ప్రశ్న విషయం చూస్తే.. కాలేజీలతో పోలిస్తే హెల్త్‌కేర్‌ రంగంలోనే హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. హాస్పిటల్‌లో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌గా ప్రయత్నించాలనే మీ నిర్ణయం సరైనదే. దానికి ముందు హాస్పిటల్‌/ హెల్త్‌ కేర్‌కు సంబంధించి ఏదైనా డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సుని చేయడం వల్ల ఈ రంగంలో మీకు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. - బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని