ఒకే సమయంలో రెండు డిగ్రీలు.. సాధ్యమేనా?

బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇగ్నోలో దూరవిద్య ద్వారా బీఏ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాను.

Published : 01 Feb 2021 00:21 IST

బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇగ్నోలో దూరవిద్య ద్వారా బీఏ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాను. రెండింటినీ ఒకేసారి చేయవచ్చా? చేస్తే ఆ డిగ్రీలకు విలువ ఉంటుందా?

- శ్రీహర్షిత

ఒకే సమయంలో ఒక రెగ్యులర్‌ కోర్సు, ఒక దూరవిద్య/ఆన్‌లైన్‌ కోర్సు చదువుకోడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) 2020లో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మీరు రెగ్యులర్‌ మోడ్‌లో ఏ కోర్సు చదువుతున్నా కానీ, దూరవిద్య/ఆన్‌లైన్‌ ద్వారా నచ్చిన కోర్సులో చేరే అవకాశం ఉంది. మీరు బీబీఏ డిగ్రీ రెగ్యులర్‌గా చదువుతూ, ఇగ్నో ద్వారా బీఏ డిగ్రీని కూడా పూర్తిచేసుకోవచ్చు. అయితే ఒకే సమయంలో రెండు డిగ్రీలను రెగ్యులర్‌ మోడ్‌లో చదవడం కుదరదు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని