తెలుగు పీజీ తర్వాత...

ముందుగా మీడియా, జర్నలిజం రంగాల గురించి చెప్పవలసి ఉంటుంది. ఇటీవలికాలంలో ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం పెరిగింది. సమకాలీన అంశాలపై ఆసక్తి,

Updated : 15 Feb 2021 01:35 IST

ఎంఏ (తెలుగు) వారికి జేఎల్‌, డీఎల్‌, తెలుగు పండిట్‌ కాకుండా ఇతర అవకాశాలున్నాయా? - వి. రమేష్‌.

ముందుగా మీడియా, జర్నలిజం రంగాల గురించి చెప్పవలసి ఉంటుంది. ఇటీవలికాలంలో ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం పెరిగింది. సమకాలీన అంశాలపై ఆసక్తి, ఉచ్చారణపై పట్టు సాధించి, సృజనాత్మకతను పెంపొందించుకుంటే మీడియా, పత్రికా రంగంలో విలేఖరులుగా, కంటెంట్‌ రచయితలుగా, న్యూస్‌ ప్రెజెంటర్‌లుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వీటితో పాటు వెబ్‌ చానల్స్‌, సినిమా, నాటక రంగాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. భాషాశాస్త్రంలో ప్రావీణ్యం సాధించి కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌లో ప్రవేశించవచ్చు. ఆంగ్ల, హిందీ భాషలపై మంచి పట్టు సాధించి అనువాద రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని