ఒరాకిల్‌ క్లౌడ్‌ కోర్సులు చేస్తే..?

బీకాం (కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. ఒరాకిల్‌ క్లౌడ్‌ వంటి కోర్సుల ద్వారా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను.

Updated : 26 Apr 2021 06:03 IST

బీకాం (కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. ఒరాకిల్‌ క్లౌడ్‌ వంటి కోర్సుల ద్వారా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలు లభిస్తాయా? - శ్రీను

బీకాం (కంప్యూటర్స్‌) చదివిన తరువాత ఒరాకిల్‌ క్లౌడ్‌ లాంటి కోర్సులు చేయడం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చు. వయసుకూ, కొత్త కోర్సులు నేర్చుకోవడానికీ ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువులంటే అనుభవానికి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసు గురించి ఆలోచించకుండా కోర్సులు చేయండి. ఈ కోర్సులో AWS, Azure, Google Cloud, DevOps లతో పాటు లైవ్‌ ప్రాజెక్ట్‌లు కూడా ఉంటాయి. వీటితో పాటు మెషిన్‌ లర్నింగ్‌, బిగ్‌ డేటా, డీప్‌ లర్నింగ్‌, NLP, R programming, python, TensorFlow లాంటి వాటిలో ప్రావీణ్యం సంపాదిస్తే మీ ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ కోర్సులు చేసినవారికి క్లౌడ్‌ డెవలపర్‌, క్లౌడ్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌, క్లౌడ్‌ కన్సల్టెంట్‌, ఒరాకిల్‌ క్లౌడ్‌ ఫినాన్స్‌ కన్సల్టెంట్‌, పైతాన్‌ ఆటోమేషన్‌ ఎక్స్‌పర్ట్‌, పాకేజ్‌ స్పెషలిస్ట్‌, డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్టు లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని