ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సులు దూరవిద్యలో!

డిప్లొమా ఇన్‌ సేఫ్టీని దూరవిద్యలో చదవొచ్చా? డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, పీజీ డిప్లొమా ఇన్‌ సేఫ్టీ, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సులు ఎక్కడ

Published : 17 May 2021 00:20 IST

డిప్లొమా ఇన్‌ సేఫ్టీని దూరవిద్యలో చదవొచ్చా? డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, పీజీ డిప్లొమా ఇన్‌ సేఫ్టీ, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?

-  షేక్‌ బాబా జీలన్‌, కడప

* డిప్లొమా ఇన్‌ సేఫ్టీని దూరవిద్యలో చదవొచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (గీశినిళీ), దెెహ్రాదూన్‌లో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ (హెల్త్‌, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్‌)ని దూరవిద్య ద్వారా అందిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ (విఖినీళీని), హైదరాబాద్‌ వారు సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, ఫైర్‌ ఆఫీసర్‌ కోర్సులను రెగ్యులర్‌ పద్ధతిలో అందిస్తున్నారు.
ఇవే కాకుండా దూరవిద్యలో డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీలో ఎంబీఏ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, హైదరాబాద్‌ వారు అందిస్తున్నారు.
వీటితో పాటు
NIFSE, LSOS UK కలిసి అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ హైజీన్‌, మాస్టర్‌  డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ హైజీన్‌, ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సులను అందిస్తున్నాయి. అన్నామలై యూనివర్సిటీ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ,  డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ హైజీన్‌లను దూరవిద్యలో అందిస్తోంది. ఈ కోర్సులు చదివినవారికి కెమికల్‌, పెట్రోకెమికల్‌, ఇంజనీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌, ఎన్విరాన్మెంట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని