సోషల్‌ సైన్స్‌ పూర్తి చేశాక..

బీఏ ( సోషల్‌ సైన్స్‌) చదివినవారు మంచి ఉద్యోగావకాశాల కోసం చాలా రకాల కోర్సులు చదవొచ్చు. బీఏలో మీరు చదివిన సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేయండి.

Updated : 10 Aug 2022 12:18 IST

బీఏ సోషల్‌ సైన్స్‌ పూర్తి చేశాను. మంచి భవిష్యత్తు కోసం ఏ కోర్సులు చదివితే బాగుంటుంది?

- కె. ప్రశాంత్‌  

* బీఏ ( సోషల్‌ సైన్స్‌) చదివినవారు మంచి ఉద్యోగావకాశాల కోసం చాలా రకాల కోర్సులు చదవొచ్చు. బీఏలో మీరు చదివిన సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేయండి. భాషాశాస్త్రాల్లో ఆసక్తి ఉంటే, డిగ్రీలో మీరు చదివిన లాంగ్వేజెస్‌కు సంబంధించిన తెలుగు/హిందీ/ఇంగ్లిష్‌/ లింగ్విస్టిక్స్‌/ఉర్ద్డూ/ సంస్కృతం/ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌/ కంపేరిటివ్‌ లిటరేచర్‌లో పీజీ చేయవచ్చు. బోధన వృత్తిపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి ఆ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ప్రాధమిక పాఠశాలల్లో బోధన కోసం డీఈడీ కోర్సు కూడా చేయవచ్చు. భాషా పండితునిగా స్థిరపడాలనుకొంటే భాషా పండిట్‌ శిక్షణ పొందవచ్చు. క్రీడల పట్ల ఆసక్తి ఉంటే బేచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది వ్యాయామ ఉపాధ్యాయుడిగా స్థిరపడవచ్చు. న్యాయశాస్త్రంలో ఆసక్తి ఉంటే లా కోర్సు, మేనేజ్‌మెంట్‌పై ఇష్టముంటే ఎంబీఏ చేయవచ్చు. పర్యాటక రంగంలో అభిరుచి ఉంటే టూరిజం మేనేజ్‌మెంట్‌, ఆతిథ్య రంగంలో ఆసక్తి ఉంటే హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పురావస్తుశాస్త్రం ఇష్టమైతే ఆర్కియాలజీ, నటనారంగం నచ్చితే థియేటర్‌ ఆర్ట్స్‌ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఇవే కాకుండా ఫిలాసఫీ, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, ఎడ్యుకేషన్‌, సోషియాలజీ, హ్యూమన్‌ రైట్స్‌, జర్నలిజం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు. మీరు ఇంటర్మీడియట్‌ స్థాయిలో మేథమేటిక్స్‌ చదివివుంటే ఎంసీఏ లాంటి కోర్సులు చేయవచ్చు. పబ్లిక్‌ పాలసీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, రీజనల్‌ స్టడీస్‌, ఫైనాన్షియల్‌ ఎకానమిక్స్‌, యానిమేషన్‌, మల్టీమీడియా, ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి వినూత్న కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని