అర్హత ఉందా?

బీటెక్‌ ఎలక్ట్రికల్‌లో, ఎంటెక్‌ను కంప్యూటర్‌ సైన్స్‌లో పూర్తిచేశాను. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు నాకు అర్హత ఉందా? వేర్వేరు సబ్జెక్టులతో బీటెక్‌, ఎంటెక్‌ చేయడం వల్ల సమస్య వస్తుందా?

Published : 18 Apr 2022 01:01 IST

బీటెక్‌ ఎలక్ట్రికల్‌లో, ఎంటెక్‌ను కంప్యూటర్‌ సైన్స్‌లో పూర్తిచేశాను. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు నాకు అర్హత ఉందా? వేర్వేరు సబ్జెక్టులతో బీటెక్‌, ఎంటెక్‌ చేయడం వల్ల సమస్య వస్తుందా?

- కె. విజయ్‌కుమార్‌

* ఏఐసీటీఈ గెజెట్‌ నోటిఫికేషన్‌ (28 ఏప్రిల్‌, 2017) ప్రకారం ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు బీటెక్‌, ఎంటెక్‌ రెండు డిగ్రీలు కూడా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో కానీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో గానీ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు బీటెక్‌, ఎంటెక్‌ రెండు డిగ్రీలూ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో అయినా, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో అయినా ఉండాలి.

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ 23 అక్టోబర్‌, 2020 నాడుఏఐసీటీఈ మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం మీరు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు కారు. ప్రస్తుతం మీకున్న విద్యార్హతలతోనే బోధన రంగంలో స్థిరపడాలనే ఆలోచన ఉంటే పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఇంజినీరింగ్‌ కళాశాల్లోనే పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంటెక్‌ చేసి, ఆ విభాగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. జాతీయ విద్యావిధానం అమలు జరిగినపుడు  సబ్జెక్టుల మధ్య ఉన్న అంతరాలు తగ్గుతాయి. ఉద్యోగ అర్హతా నియమాల్లోనూ  మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని