ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను 30 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చి స్థిరపడ్డాను. చదువంతా ఇక్కడే పూర్తయింది. నాలుగో తరగతి నుంచి ఇంజినీరింగ్‌ వరకు స్టడీ సర్టిఫికెట్స్‌ అన్నీ ఉన్నాయి. కానీ, ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ప్రైవేట్‌గా చదవడం వల్ల స్టడీ సర్టిఫికెట్స్‌ లేవు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 రాయడానికి అర్హత ఉంటుందా?    

Published : 03 Jun 2022 00:54 IST

నేను 30 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చి స్థిరపడ్డాను. చదువంతా ఇక్కడే పూర్తయింది. నాలుగో తరగతి నుంచి ఇంజినీరింగ్‌ వరకు స్టడీ సర్టిఫికెట్స్‌ అన్నీ ఉన్నాయి. కానీ, ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ప్రైవేట్‌గా చదవడం వల్ల స్టడీ సర్టిఫికెట్స్‌ లేవు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 రాయడానికి అర్హత ఉంటుందా?    

 - వెంకట రమణ

మీకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 రాయడానికి కచ్చితంగా అర్హత ఉంది. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంబంధిత ప్రాంతంలో తహసీల్దార్‌ నుంచి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ను పొందితే సరిపోతుంది. 

రెండో తరగతి, మూడో తరగతి స్టడీ సర్టిఫికెట్స్‌లో పాసైన సంవత్సరం ఒకటే (2007-08) ఉంది. ఓటీఆర్‌లో ఎలా నింపాలి? ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉందా? 

- ఒక అభ్యర్థి

మీ స్కూల్‌ నుంచి రెండు, మూడు తరగతులకు సంబంధించి చదివిన సంవత్సరాలను సరిచేసి మరొకసారి స్టడీ సర్టిఫికెట్‌ను తీసుకోండి. ఓటీఆర్‌లో సరి చేసిన సంవత్సరాలను నింపండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని