త్వరగా కొలువు కొట్టాలంటే...
డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. తర్వాత బీఈడీ, పీజీ.. ఏది చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువ? త్వరగా కొలువు రావాలంటే ఏ కోర్సులో చేరాలి?
- డి.అశోక్
మీ లక్ష్యం.. ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేటు ఉద్యోగమో మొదట నిర్ణయించుకోండి. మనదేశంలో అత్యుత్తమ ప్రభుత్వ ఉద్యోగంగా భావించే సివిల్ సర్వీసెస్‌కు డిగ్రీ విద్యార్హతగా ఉంది. సాధారణంగా పీజీ చేసినవారికి (మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్‌లను మినహాయించి) జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో బోధన చేసే అవకాశాలుంటాయి. ఒకవేళ మీరు సైన్స్ విద్యార్ధి అయితే, అదనంగా పరిశోధన సంస్థల్లో టెక్నికల్/ సైంటిఫిక్ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-4 నుంచి గ్రూప్-1 వరకు అన్ని ఉద్యోగాలకూ డిగ్రీనే విద్యార్హత. పోలీస్ ఎస్‌ఐ, బ్యాంకు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఉద్యోగాలకూ, ఇన్సూరెన్స్ ఉద్యోగాలకూ డిగ్రీనే విద్యార్హత. బీఈడీ చేస్తే కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు పాఠశాలల్లో బోధన ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. బీఈడీతోపాటు పీజీ కూడా చేస్తే నవోదయ, కేవీలాంటి విద్యాసంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగానికి అర్హత ఉంటుంది. మేనేజ్‌మెంట్ రంగంపై ఆసక్తి ఉండి, మంచి బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేస్తే ఉద్యోగావకాశాలు అధికం. సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి ఉంటే ఎంసీఏ/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. త్వరగా ఉద్యోగం పొందడమనేది మీ డిగ్రీ కంటే, పరీక్షకు ఎంత బాగా సన్నద్ధమవుతున్నారు, మీ పట్టుదల, సబ్జెక్టుపై ఉన్న పట్టు లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా