కరెంట్‌ అఫైర్స్‌

భారత చెస్‌ 77వ గ్రాండ్‌ మాస్టర్‌గా 2022, డిసెంబరు 6న ఎవరు వార్తల్లో నిలిచారు?

Published : 21 Dec 2022 02:38 IST

మాదిరి ప్రశ్నలు

* భారత చెస్‌ 77వ గ్రాండ్‌ మాస్టర్‌గా 2022, డిసెంబరు 6న ఎవరు వార్తల్లో నిలిచారు?

జ: ఆదిత్య మిత్తల్‌, ముంబయి


* భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఎంపికైన ముగ్గురు మహిళా ఎంపైర్లు ఎవరు?

జ : వింద్రా రాఠీ (ముంబయి), జనని నారాయణ్‌ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్‌ (దిల్లీ)


* కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల  ప్రకారం 2021లో దేశీయ పర్యాటకులను   ఆకరిం్షచడంలో ఏ మూడు రాష్ట్రాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి?

జ: తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌


* పర్యావరణ ఆస్కార్‌గా పేరొందిన ప్రతిష్ఠాత్మక ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ను ఎక్కడ ఏర్పాటైన అంకుర సంస్థ ‘ఖేతి’కి ప్రదానం చేశారు? (బ్రిటన్‌ యువరాజు విలియం ఈ ప్రైజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ అవార్డు విలువ పది లక్షల పౌండ్లు.)

జ: హైదరాబాద్‌


* 2022 నవంబరు, 23న ఏ నగరంలోని ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) సర్వర్లపై భారీ సైబర్‌ దాడి జరిగింది? 

జ: న్యూ దిల్లీ


* ప్రపంచంలో తొలిసారి హైడ్రోజన్‌ ఆధారిత విద్యుత్‌ రైళ్లను ఏ దేశంలో ప్రారంభించారు? 

జ: జర్మనీ


* ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు పెట్టారు? 

జ: చండీగఢ్‌


నీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించిన అనంగ్‌ తాల్‌ సరస్సు ఎక్కడ ఉంది? 

జ: దిల్లీ


నీ దహీహండీ అనే ప్రత్యేకమైన సాహస క్రీడను రాష్ట్ర క్రీడగా ప్రకటించిన రాష్ట్రం ఏది? 

 జ: మహారాష్ట్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని