విదేశాల్లో అగ్రికల్చర్‌ కోర్సు..

మీ అబ్బాయి అగ్రికల్చర్‌ కోర్సును విదేశాల్లో చదివిన తరువాత అక్కడే స్థిరపడతాడా, మనదేశానికి తిరిగివస్తాడా అనే విషయాన్ని బట్టి, ఏ దేశంలో చదవాలనే నిర్ణయం తీసుకోండి.

Published : 29 Dec 2022 00:36 IST

మా అబ్బాయికి వ్యవసాయం అంటే ఆసక్తి. అగ్రికల్చరల్‌ సైన్స్‌ కోర్సును విదేశాల్లో చదవాలనుకుంటున్నాడు. ఏ యూనివర్సిటీలు అనుకూలం? 

కుమార్‌

మీ అబ్బాయి అగ్రికల్చర్‌ కోర్సును విదేశాల్లో చదివిన తరువాత అక్కడే స్థిరపడతాడా, మనదేశానికి తిరిగివస్తాడా అనే విషయాన్ని బట్టి, ఏ దేశంలో చదవాలనే నిర్ణయం తీసుకోండి. అగ్రికల్చర్‌లో మొదటి డిగ్రీని మనదేశంలో చేసి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్ళడం శ్రేయస్కరం. అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ లైఫ్‌ సైన్సెస్‌ చదివినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువే. మీ అబ్బాయి అగ్రికల్చర్‌ కోర్సుని చదవాలనుకొనే దేశంలో ఏ స్పెషలైజేషన్‌కి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయో, ఆ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. మరిన్ని ఉద్యోగావకాశాల కోసం అగ్రికల్చర్‌లో లైఫ్‌ సైన్సెస్‌ సంబంధిత స్పెషలైజేషన్‌లు కూడా ఎంచుకుని ఆ రంగంలోనూ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

యూకేలో కేంబ్రిడ్జ్‌, నాటింగ్‌ హామ్‌, గ్లాస్గో, లివర్‌ పూల్‌, బ్రిస్టల్‌ యూనివర్సిటీలు అగ్రికల్చర్‌ కోర్సును అందిస్తున్నాయి. కెనడాలో గుల్ఫ్‌, అల్బెట్రా,
బ్రిటిష్‌ కొలంబియా, మెక్‌ గిల్‌, సాస్కట్చెవన్‌ విశ్వ విద్యాలయాలు, ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్‌బోర్న్‌, క్వీన్స్‌ లాండ్‌, అడిలైడ్‌, లాత్రోబే యూనివర్శిటీలు ఈ కోర్సు అందిస్తున్నాయి యూఎస్‌లో.. మసాచుసెట్స్‌, పర్ద్యూ, కార్నెల్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడా విశ్వ విద్యాలయాల్లో చదువుకోవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని